ప్రధాని మోడీ (PM Modi) ఫొటో షూట్ తర్వాత లక్షద్వీప్ (Lakshadweep) వెళ్లాలని పర్యాటకులు తమ లక్ష్యంగా పెట్టుకుంటున్నారట. ప్రధాని పర్యటన తర్వాత లక్షద్వీప్‌కు పర్యాటకుల తాకిడి కూడా బాగానే పెరిగింది. గతంలో సెలెబ్రిటీలు, టూరిస్టులు మాల్దీవుస్‌ను (Maldives) ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకొని మరీ లక్షద్వీప్ వైపు పరుగులు పెడుతున్నారట. ఇప్పటికే ఈ ప్రాంతంలో పర్యాటకుల రద్దీ పెరిగి హోటల్ రూమ్స్ బుకింగ్స్ కూడా భారీగా పెరిగాయని తెలుస్తోంది.

లక్షద్వీప్ దీవులు మన దేశంలో అత్యంత అందమైన, ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతం. చక్కటి బీచ్ లు, చల్లని గాలులతో వెకేషన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అరేబియా సముద్రంలో ఈ లక్ష్యదీప్ దీవులు ఉన్నాయి. మాల్దీవుల కంటే తక్కువ ఖర్చుతో ఈ దీవులకు వెళ్లొచ్చని అంటున్నారు. 1956లో ఈ ప్రాంతాన్ని భారత ప్రభుత్వం (Indian Governement) కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) దీనిని ప్రకటించింది. ఇక్కడ మొత్తం 36 దీవులు ఉన్నాయి. ఇందులో 10 దీవులే నివాసానికి అనువైన ప్రాంతాలుగా ఉంటున్నాయి. మినీకాయ్ ద్వీపం, కల్పేని దీవులు, కద్మత్ దీవులు, గోల్డెన్ ద్వీపం, తిన్నకర ద్వీపం ప్రసిద్ది చెందిన దీవులుగా ఉన్నాయి.
ఈ లక్షద్వీప్‌కు వెళ్లాలంటే ముందు కేరళలోని కొచ్చిన్‌కు చేరుకొని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (Cochin International Airport) నుంచి లక్షద్వీప్ అగట్టి ఐలాండ్‌కు విమానాలు అందుబాటులో ఉంటాయి. ఈ విమానం ప్రయాణం గంటన్నర పాటు ఉంటుంది. కనీస ధర అయితే రూ.5 వేల నుంచి గరిష్టంగా అంటే రూ.10 వేల - రూ.15 వేల వన్ వే ట్రిప్‌కు ఖర్చవుతుంది. టూ వేస్ బుక్ చేసుకుంటే రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకు చార్జీలు ఉంటాయి. సీజన్ బట్టి ఈ ధరలు చేంజ్ అవుతుంటాయి. లక్ష్యద్వీప్ వెళ్లేందుకు అక్టోబర్-మే వరకు మంచి సీజన్.
లక్షద్వీప్‌కు షిప్‌లో (Ship) కూడా వెళ్లే వెసులుబాటు ఉంది. ఇందుకు గాను 7 ప్యాసింజర్ షిప్స్ ఉంటాయి. ఎంవీ కవరత్తి, ఎంవీ అరేబియన్ సీ, ఎంవీ లక్షద్వీప్ సీ అనే పేర్లతో వీటిని అందుబాటులో ఉంచుతారు. ఒక్కొక్కరికి సెకండ్ క్లాస్-రూ.2 వేలు, డీలక్స్-రూ.3 వేలు, ఫస్ట్ క్లాస్-రూ.5 వేల వరకు టికెట్ రేట్ ఉంటుంది. ఇండియన్ ఐలాండ్స్ డాట్ కామ్ లాంటి సైట్స్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. షిప్‌లో ప్రయాణించి లక్షద్వీప్ చేరుకోవాలంటే మనం వెళ్లే దీవిని బట్టి 14-18 గంటల సమయం పడుతుంది.
అయితే అనుమతి లేకుండా ఇక్కడి వెళ్లడం కుదరదు. ఇక్కడికి వెళ్లాలంటే అనుమతిని పొందడానికి, మీరు ముందుగా క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దానిని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి నేర చరిత్ర లేదని ఎండార్స్ చేసుకోవాలి. గుర్తింపు పత్రాలకు 3 పాస్‌పోర్ట్ ఫోటోలు జత చేయాలి. క్లియరెన్స్ సర్టిఫికేట్ తర్వాత, మీరు ఎంట్రెన్స్ పర్మిషన్ డాక్యుమెంట్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి లేదా కొచ్చిలోని విల్లింగ్‌డన్ ఐలాండ్‌లో ( Kochi Willingdon Island) ఉన్న లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ (Lakshadweep Administration Office) నుంచి అనుమతి తీసుకోవచ్చు. ఈ ఎంట్రెన్స్ సర్టిఫికెట్‌ను లక్షద్వీప్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు మీరు ఇవ్వాలి.