రియలన్స్ జియో(Reliance jio), ఎయిర్‌టెన్(ఎయిర్టెల్ ), వోడాఫోన్(Vadaphone) ఐడియాల టారిఫ్‌లు అమాంతం పెరిగాయి.
రియలన్స్ జియో(Reliance jio), ఎయిర్‌టెన్(ఎయిర్టెల్ ), వోడాఫోన్(Vadaphone) ఐడియాల టారిఫ్‌లు అమాంతం పెరిగాయి. ఒక్కసారిగా రేట్లు అంతేసి పెరగడంతో వినియోగదారులపై ఊహించనంత భారం పడింది. అయితే ప్రైవేటు టెలికాం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచినప్పటికీ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం వినయోగదారులను దృష్టిలో పెట్టుకుని పెంచలేదు. దాంతో చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తక్కువ ధరకే ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తుండడంతో చాలా మంది ఈ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా నెట్‌వర్క్‌ను విస్తరింపచేసుకుంటోంది. 5జీ నెట్‌వర్క్ తీసుకువచ్చేందుకు సంసిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తమ నెట్‌వర్క్‌కు మారాలనుకొనేవారికి బీఎస్‌ఎన్‌ఎల్ ఓ ఆఫర్‌ను ప్రకటించింది. ఆన్‌లైన్‌లోనే సులువుగా నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకొనే సదుపాయం కలిగించింది. అయితే మనకు కావాల్సిన ఫాన్సీ నంబర్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలన్న విషయంలో చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. చాలా సింపుల్. ముందుగా మనం గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి BSNL Choose Your Mobile Number అని టైప్ చేయాలి. తర్వాత కింద కనిపించే cymnపై క్లిక్ చేయాలి. మన జోన్‌ను, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. అప్పుడు కొన్ని ఫ్యాన్సీ నంబర్లు డిస్‌ప్లే అవుతాయి. అందులో నచ్చిన నంబర్ కోసం వెతికేందుకు ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. search with series, start number, end number, sum of numbers అనే నాలుగు ఆప్షన్లు డిస్‌ప్లే అవుతాయి. ఫ్యాన్సీ నంబర్ కోసం అయితే ఫ్యాన్సీ నంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వీటిలో ఒక ఆప్షన్‌ను ఎంచుకొని మీకు నచ్చిన నంబర్‌ను ఎంటర్ చేసి search పై క్లిక్ చేయాలి. మనం ఎంటర్ చేసిన నంబర్ ఆధారంగా కొన్ని ఫోన్ నంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన నంబర్‌ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజర్వ్ చేసుకునేందుకు Reserve Numberపై క్లిక్ చేయాలి. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న నంబర్‌ను నమోదు చేయగానే ఓ ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. దీంతో ఆ నంబర్ మీకు రిజర్వ్ అవుతుంది. ఆ తర్వాత మనకు దగ్గరలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుకు వెళ్లి ఆ నంబర్‌తో సిమ్ కార్డు తీసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు?