ఎందుకైనా మంచిదని పాస్‌పోర్ట్ తీసిపెట్టుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆధార్‌కార్డు ఎంత కంపల్సరీనో పాస్‌పోర్ట్ కూడా అంత తప్పనసరి అవుతున్నది. యువత దగ్గర పాస్‌పోర్ట్ కచ్చితంగా ఉంటోంది. ఎప్పుడు ఫారిన్ ట్రిప్ ఛాన్స్ వస్తుందో తెలియదు కదా! అప్పటికప్పుడు పాస్‌పోర్ట్ తీసుకోవడం కష్టం కాబట్టి ముందే తీసుకుని పెట్టుకుంటున్నారు. పాస్‌పోర్ట్ జారీ అయిన పదేళ్ల పాటు అది చెల్లుబాటులో ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి.
ఎందుకైనా మంచిదని పాస్‌పోర్ట్ తీసిపెట్టుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆధార్‌కార్డు(Aadhaar Card) ఎంత కంపల్సరీనో పాస్‌పోర్ట్ కూడా అంత తప్పనసరి అవుతున్నది. యువత దగ్గర పాస్‌పోర్ట్ కచ్చితంగా ఉంటోంది. ఎప్పుడు ఫారిన్ ట్రిప్ ఛాన్స్ వస్తుందో తెలియదు కదా! అప్పటికప్పుడు పాస్‌పోర్ట్ తీసుకోవడం కష్టం కాబట్టి ముందే తీసుకుని పెట్టుకుంటున్నారు. పాస్‌పోర్ట్ జారీ అయిన పదేళ్ల పాటు అది చెల్లుబాటులో ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆన్‌లైన్‌లో ఈజీగా చేసుకోవచ్చు. 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పాస్‌పోర్ట్ కాలపరిమితి అయిదేళ్లు ఉంటుంది. లేదూ 18 ఏళ్లు నిండే వరకు ఉంటుంది. ఆ తర్వాత పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకోవాలి. ఇక 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు పది సంవత్సరాల పాస్‌పోర్ట్‌ను తీసుకోవచ్చు.గడువు ముగిసిన తర్వాత, దాన్ని ఈజీగా ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
ముందుగా పాస్‌పోర్ట్ సేవ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఒకవేళ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకుని లాగిన్ ఐడీ పొందవచ్చు. ఆ తర్వాత లాగిన్ ఐడీతో లాగిన్ అవ్వాలి. Apply for fresh passport/Reissue of Possport ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో అడిగిన వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయాలి. ఆ తర్వాత Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి. పేమెంట్ పద్ధతుల్లో ఏదైనా ఒక దానిని ఎంచుకుని, దాని ద్వారా పేమెంట్ చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. Print Application Receipt మీద క్లిక్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫామ్‌ను తీసుకుని నిర్ణీత తేదీన దగ్గరలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లాలి. సరే మరి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం ఎలా అన్న ప్రశ్న వస్తున్నది కదూ! అది కూడా ఈజీనే!
పాస్‌పోర్ట్ సేవ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి View Saved and Submit Applicationను సెలెక్ట్ చేసుకోవాలి. Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి. పేమెంట్ పద్ధతిని, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంచుకోవాలి. పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లోకేషన్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. అపాయింట్‌మెంట్ కోసం తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసి Pay and Book the Appointment మీద క్లిక్ చేయాలి. రెన్యువల్ కోసం కొన్ని సర్టిఫికెట్లను రెడీ చేసి పెట్టుకోవాలి. ఒరిజనల్ పాస్‌పోర్టు, సెల్ఫ్ డిక్లరేషన్‌తో ECR/Non-ECR పేజీ ఫోటోకాపీలు, అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ మొదటి, చివరి పేజీల జిరాక్స్ కాపీలు, చెల్లుబాటు అయ్యే ఎక్స్టెన్షన్ పేజీ జిరాక్స్ కాపీ, సెల్ఫ్ అటెస్టెడ్ పేజ్ ఆఫ్ అబ్జర్వేషన్ జిరాక్స్ కాపీ. అన్నట్టు రీ ఇష్యూ వేరు. రెన్యువల్ వేరు. రెండింటికి వేర్వేరు అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. రెన్యువల్‌కు అప్లయి చేసుకున్న నాలుగు నుంచి ఆరు వారాలలో పాస్‌పోర్ట్ రెన్యువల్ అవుతుంది..