ఓ మహిళ స్లీపింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని రూ.9 లక్షలు గెలుచుకుంది.
ఓ మహిళ స్లీపింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని రూ.9 లక్షలు గెలుచుకుంది. బెంగుళూరు స్టార్టప్ ఇనిషియేటివ్ అయిన 'వేక్‌ఫిట్' స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్(Wakefit' Sleep Internship Program) మూడో సీజన్‌లో సాయిశ్వరీ పాటిల్(Saiswari Patil) 'స్లీప్ ఛాంపియన్'(Sleep Champion) టైటిల్‌ను సాధించుకున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేసిన 12 మంది 'స్లీప్ ఇంటర్న్‌లలో' సాయిశ్వరీ పాటిల్ ఒకరు. వేక్‌ఫిట్ నిద్రకు విలువనిచ్చే వ్యక్తులను ప్రోత్సహిస్తుంది. ప్రతి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయేలా చేస్తుంది. ఇంటర్న్‌లు పగటిపూట 20 నిమిషాల పవర్ న్యాప్‌లు తీసుకోవాలని కూడా సూచిస్తుంది. ఇందులో పాల్గొనేవారికి ప్రీమియం మ్యాట్రీస్, కాంటాక్ట్‌లెస్ స్లీప్ ట్రాకర్ ఇస్తారు. మూడు సీజన్లలో 51 మంది ఇందులో పాల్గొన్నారని వారికి మొత్తం రూ.63 లక్షల స్టైయిఫండ్ చెల్లించినట్లు వేక్‌ఫిట్ వెల్లడించింది. 50% మంది భారతీయులు ఎక్కువ పనిచేయడం, నిద్ర సరిగా పోకపోవడం, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి సాధారణ కారణాలతో నిద్రకు దూరమవుతున్నారని వేక్‌ఫిట్ సంస్థ వెల్లడించింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం, అర్ధరాత్రి వరకు పనిచేయడం వల్ల నిద్రకు దూరమవుతున్నామని సాయిశ్వరీ పాటిల్ తెలిపింది. ఈ ఇటర్న్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణగా నిద్రపోవడం నేర్చుకున్నానని ఆమె వివరించింది. నేను బాగా నిద్రపోతాను, ఒక్కోసారి బైక్ మీద కూడా పడుకుంటాను అందుకే ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనాలన్పించిందని తెలిపింది.