అపర కుబేరుడు ముఖేశ్‌ అంబానీ(Mukesh ambani) చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ(ananth ambani) పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.

అపర కుబేరుడు ముఖేశ్‌ అంబానీ(Mukesh ambani) చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ(ananth ambani) పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది సెలెబ్రెటీలు వచ్చి వధూవరులను ఆశీర్వదించి, తమ తాహతుకు తగినట్టుగా కానుకలను అందించి వెనుదిరిగారు. ఆరేడు వేల కోట్ల రూపాయలు ఈజీగా ఖర్చు అయి ఉంటుందన్నది కొందరి అభిప్రాయం. ఆరు నెలలుగా జరుగుతున్న పెళ్లి తంతు కాబట్టి అయ్యే ఉంటుంది. వివాహ వేడుకకు వచ్చిన అతిథులకు పెద్ద పెద్ద బహుమతులు కూడా ఇచ్చారాయె! ఇదంతా ఓకేనే కానీ పెళ్లిని దగ్గరుండి జరిపించిన పంతులుకు(Priest) ఏమిచ్చారన్నదే అందరిని వేధిస్తున్న ప్రశ్న! అనంత్‌ అంబానీ-రాధిక పెళ్లి చేసిన పండితుడి పేరు చంద్రశేఖర్‌ శర్మ(charashekar sharma). పెళ్లిని ఎంతో శాస్త్రోక్తంగా జరిపించాడాయన! అన్నట్టు అంబానీ కుటుంబంలో పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు అన్ని ఈయనే జరిపిస్తారు. గుజరాత్‌ జామ నగర్‌లో నిర్వహించిన అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలప్పుడు కూడా చంద్రశేఖర శర్మనే అన్నికార్యక్రమాలను జరిపించాడు. ఈయనంటే అంబానీ కుటుంబానికి గౌరవం! అందుకే చంద్రశేఖర శర్మకు అంబానీ కుటుంబం ఎయిర్‌పోర్టుకెళ్లి స్వాగతం పలికింది. సాధార‌ణంగా పండిట్ చంద్ర‌శేఖ‌ర‌ శర్మ వివాహ ఆచారాలను నిర్వహించడానికి పాతిక వేల రూపాయలు వసూలు చేస్తారు. ఇందులో దానికి అవసరమైన సామగ్రి కూడా ఉంటుంది. అయితే, అనంత్ అంబానీ వివాహ వేడుక‌ల కోసం ఆయ‌న‌కు అంబానీ కుటుంబం ల‌క్ష‌ల్లోనే సంభావన ముట్టచెప్పినట్టు స‌మాచారం. దీంతో పాటు ఆయనకు విలాసవంతమైన వసతులు కల్పించారట! ఆపై ఖరీదైన బహుమతులు అందించారట!

Eha Tv

Eha Tv

Next Story