వసంతరాత్రులు ఆహ్లాదకరంగా ఉంటాయి. వసంత వెన్నెల రాత్రి అయితే అద్భుతంగా ఉంటుంది. అన్ని రాత్రులు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా! ఈ ఆకాంక్ష మణిపూర్‌లో(Manipur) హోలీ వేడుకలను(Holi Celebrations) చూసిన వారికి ఎవరికైనా కలిగి తీరుతుంది. మణిపూర్‌లో హోలీ వేడుకలు ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రస్తుతం మణిపూర్ పరిస్థితి బాగోలేదు కాబట్టి ఈసారి వేడుకలు అంతగా జరగకపోవచ్చు.
వసంతరాత్రులు ఆహ్లాదకరంగా ఉంటాయి. వసంత వెన్నెల రాత్రి అయితే అద్భుతంగా ఉంటుంది. అన్ని రాత్రులు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా! ఈ ఆకాంక్ష మణిపూర్‌లో(Manipur) హోలీ వేడుకలను(Holi Celebrations) చూసిన వారికి ఎవరికైనా కలిగి తీరుతుంది. మణిపూర్‌లో హోలీ వేడుకలు ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రస్తుతం మణిపూర్ పరిస్థితి బాగోలేదు కాబట్టి ఈసారి వేడుకలు అంతగా జరగకపోవచ్చు. పున్నమి రాత్రి వేళ డోలు వాయిద్యాలు, జానపద పాటలు, సంప్రదాయ నృత్యాలతో వేడుక చేసుకుంటారు. మణిపూర్ క్యాలెండర్‌లో చివరి నెల అయిన లామ్తాలో వచ్చే పౌర్ణమినే హోలీగా జరుపుకుంటారు. హోలీని ఇక్కడ యావ్‌షాంగ్‌గా జరుపుకుంటారు. పున్నమిరేయిలో హోలికా దహనం చేస్తారుగా! అలాగే ఇక్కడ కూడా ఓ చెడును అగ్నికి ఆహుతి ఇస్తారు. వెదురుతో నిర్మించిన ఓ పర్ణశాల వంటి పాకను అగ్నికి సమర్పించుకుంటారు. ఈ పర్ణశాలను వారు యావ్‌షాంగ్ మై తాబాగా పిలుచుకుంటారు. అక్కడ్నుంచి రంగుల పండుగ మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఆరు రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతాయి. అయితే వీరు జరుపుకునే హోలీ కాసింత భిన్నంగా ఉంటుంది.
మొదటి రోజు ఉదయం చిన్నారులు ఇళ్లిళ్లూ తిరిగి బియ్యం, కాయగూరలు సేకరిస్తారు. మర్నాడు పిల్లలు తమ ఇరుగుపొరుగు ఇళ్లకు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు. వారిచ్చే డబ్బు, కానుకలను స్వీకరిస్తారు.కొందరు రహదారులపై వచ్చిపోయే వాహనాలను ఆపి మరీ డబ్బు వసూలు చేస్తారు.ఈ తంతును వారు సొల్ మున్బా అంటారు. మణిపూర్ వైష్ణవులు హోలీని ఎంతో సంబరంగా, సంతోషంగా జరుపుకుంటారు. హోలీ వస్తుందంటే చాలు వైష్ణవాలయాలన్ని కొత్త కళను సంతరించుకుంటాయి. ద్దలంతా వైష్ణవ భజనలో మునిగిపోతారు. ఆరో రోజు విజయ్ గోవింద ప్రాంగణంలో హాలంగర్‌ను నిర్వహిస్తారు. ఇది కూడా వారికి ఓ పండుగే! కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకే! 1779లో మణిపూర్ మహారాజు రాజర్షి భాగ్యచంద్ర ఈ పండుగను మళ్లీ జనబాహుళ్యంలోకి తెచ్చాడు. ఈ రోజున గోవిందాలయం నుంచి విజయ్ గోవిందాలయం వరకు ప్రజలు పెద్ద ఊరేగింపు తీస్తారు. భజనలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా విజయ్ గోవింద్ టెంపుల్‌కు వెళతారు. నిజానికి ఇది గొప్ప పండుగ. అన్ని కులాలను ఒక్కటిగా చేసే పండుగ. బీద గొప్ప అన్న తేడాలు లేని పండుగ. అందరూ ఒక్కటై ఆనందంగా జరుపుకునే పండుగ. యువతీ యువకులకైతే చెప్పలేనంత ఆనందం. వివిధ ప్రాంతాల్లో యువతీయువకులు చేసే తబల్ చంగ్బా నృత్యం అందరిని ఆకట్టుకుంటుంది. అరుదుగా లభించే ఈ అవకాశాన్ని వారు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. ఇందుకోసం అమ్మాయిలు విరాళాలు సేకరిస్తారు. అబ్బాయిలేమో నిర్వహణ గట్రా పనులు చూసుకుంటారు.పండుగ సందర్భంగా ఆటల పోటీలు కూడా జరుగుతాయి.కాసింత విభిన్నంగా ఉండే ఆ క్రీడల్లో పెద్దవాళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.