దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి కిరాయిలపై(House Rent) ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ నివేదిక(Report by property consultant Anarac) ఇచ్చింది. జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య అద్దెలు బాగా పెరిగాయని ఈ నివేదికలో పేర్కొంది. అత్యధికంగా బెంగళూరులో(Bangalore) కిరాయిలు పెరిగాయని తెలిపింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి కిరాయిలపై(House Rent) ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ నివేదిక(property consultant Anarac) ఇచ్చింది. జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య అద్దెలు బాగా పెరిగాయని ఈ నివేదికలో పేర్కొంది. అత్యధికంగా బెంగళూరులో(Bangalore) కిరాయిలు పెరిగాయని తెలిపింది. ఐటీ క్యాపిటల్‌గా పేరున్న బెంగళూరులో గత 9 నెలల్లో 31 శాతం అద్దె పెరిగింది. బెంగళూరులో 1000 ఎస్‌ఎఫ్‌టీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ సుమారు 31 శాతం పెరిగినట్లు తెలిపింది. సాధారణంగా బెంగళూరులోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్టాట్లకు రూ.28,500 వరకు కిరాయి చెల్లించాలి. జనవరిలో ఇదే ఫ్లాట్‌ అద్దె 24,600 గా ఉంది. బెంగళూరులోని సర్జాపూర్‌ రోడ్‌లో రెసిడెన్షియల్‌ అద్దెలు 27 శాతం పెరిగాయి.
బెంగళూరుతో పాటు ప్రధాన నగరాల్లో అద్దెలు పెరిగాయి. అద్దెలు పెరిగిన రెండో నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. ఐటీ సెకండ్‌ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాద్‌లో గత తొమ్మిదినెలల కాలంలో 24 శాతం అద్దెలు పెరిగినట్లు అనరాక్‌ నివేదిక తెలిపింది. హైదరాబాద్‌తో(Hyderabad) పాటు పుణె, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లో అద్దెలు పెరిగాయి. పుణెలో 17 శాతం పెరగగా, ఢిల్లీలో జనవరి నుంచి సెప్టెంబర్‌ కాలంలో 14 శాతం అద్దెలుపెరిగాయి. నోయిడాలో 13 శాతం పెరగగా గురుగ్రామ్‌లోని సోహ్నాలో 11 శాతం పెరిగింది.
ముంబైలో చెంబూర్, ములుంద్ ప్రాంతాల్లో ఇంటి అద్దె 14 శాతం, 9 శాతం పెరుగుదల ఉంది. చెన్నైలోని పల్లవరం, పెరంబూర్ ప్రాంతాల్లో ఇంటి 12 శాతం, 9 శాతం అద్దెలు పెరిగాయి. అయితే గత తొమ్మిది నెలల్లో కోల్‌కతాలోని బైపాస్, రాజర్‌హట్ ప్రాంతాల్లో 14 శాతం,9 శాతం పెరుగుదల కనిపించింది.

Updated On 10 Nov 2023 5:40 AM GMT
Ehatv

Ehatv

Next Story