వన్డే వరల్డ్‌కప్‌లో(World Cup) ఇండియా(India)-పాకిస్తాన్(Pakistan) మధ్య అహ్మదాబాద్‌లో పోరు జరిగినప్పుడు ఆ నగరం జనాలతో కిటకిటలాడిపోయింది. హోటళ్ల రేట్లు(Hotel Price) అమాంతం పెరిగిపోయాయి. మామూలు హోటల్స్‌లోని గదులకు కూడా రోజుకు లక్ష రూపాయల చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయోధ్యలో(Ayodhya) అలాంటి సీనే రిపీట్ అవుతోంది.
వన్డే వరల్డ్‌కప్‌లో(World Cup) ఇండియా(India)-పాకిస్తాన్(Pakistan) మధ్య అహ్మదాబాద్‌లో పోరు జరిగినప్పుడు ఆ నగరం జనాలతో కిటకిటలాడిపోయింది. హోటళ్ల రేట్లు(Hotel Price) అమాంతం పెరిగిపోయాయి. మామూలు హోటల్స్‌లోని గదులకు కూడా రోజుకు లక్ష రూపాయల చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయోధ్యలో(Ayodhya) అలాంటి సీనే రిపీట్ అవుతోంది. ఈ నెల 22వ తేదీన రామ్‌లల్లా పవిత్రోత్సవం జరగనుంది కదా! దాన్ని కనులారా తిలకించడానికి భక్తులు క్యూలు కడుతున్నారు. ఇప్పటికే ఇక్కడి హోటళ్ల బుకింగ్స్(Hotel Bookings) 80 శాతం మేరకు పూర్తయ్యాయి. హోటల్ గది బుకింగ్ ధర గతంలో కంటే అయిదు రెట్లు పెరిగిందంటేనే జనాల తాకిడి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
22వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఎక్కడలేని ప్రచారం జరుగుతోంది. బీజేపీ(BJP) ఐటీ విభాగం అయితే ఈ పని మీదనే ఉంది. ఆ ప్రచారం కారణంగానే చాలా మంది ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయోధ్యలోని పలు లగ్జరీ హోటళ్లలో ఒక రోజు గదికి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ రోజున మనదేశం నుంచే కాకుడా విదేశాల నుంచి కూడా భక్తులు(Piligrims) అయోధ్యకు వస్తారని అనుకుంటున్నారు. సుమారు అయిదు లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ గమనించిన స్థానిక హోటళ్ల యజమానులు గదుల ధరలను అమాంతం పెంచేశారు.
హోటల్ అయోధ్య ప్యాలెస్‌లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె సుమారు 18,500 రూపాయలు పలుకుతోంది. మామూలుగా అయితే ఇక్కడ రూమ్ రెంట్ 3,700 రూపాయలు ఉంటుందంతే! ది రామాయణ హోటల్‌లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె 40 వేల రూపాయలు. 2023లో దీని అద్దె 14,900 రూపాయలుగా ఉండేది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్‌లో ప్రస్తుతం ఒకరోజు అద్దె దాదాపు 70, 500 రూపాయలు.
గత ఏడాది జనవరిలో ఇక్కడ ఇదే గదికి 16,800 రూపాయలుగా ఉండేది. అయోధ్యలోని హోటల్స్ అన్ని జనవరి 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు బుక్ అయిపోయాయి. ఈ హోటల్‌లో గది అద్దె రోజుకు పది వేల రూపాయల నుంచి పాతికవేల రూపాయల వరకూ పెరిగింది. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యనే అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్‌లోని లగ్జరీ రూమ్ ఒకరోజు అద్దె లక్ష రూపాయలకు బుక్ అయ్యింది. ఈ హోటల్‌లోని గదులన్నీ బుక్ అయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. గతంలో ఈ హోటల్‌లో గది అద్దె 7,500 రూపాయలు మాత్రమే ఉండేది.