ఈ మధ్య కాలంలో హనీట్రాప్‌లు ఎక్కువయ్యాయి.

ఈ మధ్య కాలంలో హనీట్రాప్‌లు ఎక్కువయ్యాయి. నయన (Nayana) అనే యువతి ఓ కాంట్రాక్టర్‌ను లక్ష్యంగా చేసుకొని ఇంటికి పిలిపించుకుని అతని ఒంటిమీద ఉన్న సొమ్మంతా దోచుకుని ఉడాయించిన ఘటన బెంగళూరు(Bengaluru )లో చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతి అయిన నయనతో కలిసి మోసగాళ్లు ఓ కాంట్రాక్టరు (55)ను హనీ ట్రాప్‌ చేశారు. బ్యాడరహళ్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. దోపిడీ గ్యాంగ్‌కు చెందిన ముఠా సంతోష్‌, జయరాజ్, అజయ్‌ అనే ముగ్గురు కలిసి నయనను ఎరవేశారు. సివిల్‌ కాంట్రాక్టర్‌ను యువతితో పరిచయం పెంచుకునేలా చేశారు. అతనితో ఆమె నిత్యం ఫోన్‌లో మాట్లాడేది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఇంటికి వచ్చి టీ తాగి వెళ్లండని ఓ రోజు యువతి కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేసింది. దీంతో కాంట్రాక్టర్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. అతను వెళ్లిన కొద్దిసేపటికే నిందితులు పోలీసుల దుస్తుల్లో వచ్చి.. ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అతని ఫొటోలు తీసుకున్నారు. కాంట్రాక్టర్‌ ఒంటిపై ఉన్న రూ.5 లక్షల విలువైన బంగారం, జేబులో ఉన్న రూ.29 వేల క్యాష్‌, ఫోన్ పే నుంచి మరో 26 వేలు లాక్కున్నారు. వాళ్లు వెళ్లిపోయాక ఇద్దరం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కాంట్రాక్టర్‌ యువతికి చెప్పడంతో.. మరిన్ని ఇబ్బందులు వస్తాయని వద్దని యువతి వారించింది. అయితే బాధితుడు ఒక్కడే వెళ్లి బ్యాడరహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులు సంతోష్, జయరాజ్, అజయ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పరారీలో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ehatv

ehatv

Next Story