ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆగ్రాలోని(Aagra) ఓ హోటల్‌లో పనిచేసే యువతిపై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మద్యం తాగించి, అమానవీయంగా దాడి చేశారు యువతిని గదిలోని లాక్కెళుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Agra Hotel Gangrape On Employee
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆగ్రాలోని(Aagra) ఓ హోటల్‌లో పనిచేసే యువతిపై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మద్యం తాగించి, అమానవీయంగా దాడి చేశారు యువతిని గదిలోని లాక్కెళుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి తాజ్‌గంగ పోలీస్‌స్టేషన్‌కు(Taj Ganga Police station) ఓ యువతి ఫోన్ చేసింది. ఏడుస్తూ జరిగిన విషయాన్ని తెలిపింది. ఆ హోటల్‌లో ఆ యువతి ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. శనివార అర్ధరాత్రి సమయంలో యువతి స్నేహితురాలు ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. మద్యం మత్తులో వారితో పాటే ఉన్న మరో నలుగురు యువకులు బాధితురాలిని ఓ గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కాపాడండి..కాపాడండి అని ఆ యువతి కేకలు పెడుతున్న ఓ వీడియో పోలీసులకు దొరికింది. దుండగులను ప్రతిఘటించానని, వారు తనపై దాడి చేశారని చెప్పింది. గాజు గ్లాసుతో తలపై కొట్టారని వాపోయారు. అంతకు ముందు తీసిన తన అభ్యంతరకర వీడియోను బయటపెడతామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు యువకులను, ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్పించారు.
