హిందీ సినీ గీత రచయిత షకీల్‌ రాసిన అందమైన పాట అది! ప్రపంచం మొత్తానికి ఓ అద్భుమైన ప్రేమ చిహ్నాన్ని అందించిన షాజహాన్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! కవి అన్నట్టు ఆ పాలరాతి కట్టడం నీడలో ప్రేమచర్చలు సదా జరుగుతూనే ఉంటాయి. ధవళకాంతుల్లో మెరిసిపోయే ప్రేమసౌధం ప్రేమకు అచ్చమైన నిర్వచనం. తండ్రి షాజహాన్‌ను బందీ చేసి ఆయన సింహసాన్ని లాగేసుకున్న ఔరంగజేబు కూడా ప్రేమకు దాసానుదాసుడే! తండ్రి కట్టిన తాజ్‌మహల్‌ లాంటిదే తన భార్య జ్ఞాపకార్థం […]

హిందీ సినీ గీత రచయిత షకీల్‌ రాసిన అందమైన పాట అది! ప్రపంచం మొత్తానికి ఓ అద్భుమైన ప్రేమ చిహ్నాన్ని అందించిన షాజహాన్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! కవి అన్నట్టు ఆ పాలరాతి కట్టడం నీడలో ప్రేమచర్చలు సదా జరుగుతూనే ఉంటాయి. ధవళకాంతుల్లో మెరిసిపోయే ప్రేమసౌధం ప్రేమకు అచ్చమైన నిర్వచనం. తండ్రి షాజహాన్‌ను బందీ చేసి ఆయన సింహసాన్ని లాగేసుకున్న ఔరంగజేబు కూడా ప్రేమకు దాసానుదాసుడే! తండ్రి కట్టిన తాజ్‌మహల్‌ లాంటిదే తన భార్య జ్ఞాపకార్థం కట్టాలనుకున్నాడు. కాకపోతే షాజహాన్‌ అంతటి దిల్‌దార్‌ కాదు కాబట్టి డబ్బుకు కాసింత వెనుకాడాడు. అందుకే తాజ్‌మహల్‌ అంత అందంగా అది రూపుదిద్దుకోలేకపోయింది. అయినప్పటికీ ఆ దక్కనీ తాజ్‌గా పేరొందింది. పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌కు వెళితే అక్కడ తాజ్‌మహల్‌ను పోలిన ఓ ప్రేమచిహ్నాన్ని చూడొచ్చు. దాని పేరు బీబీ కా మఖ్బారా! ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ నిర్మించిన ఈ ప్రేమసౌధం అంతో ఇంతో తాజ్‌మహల్‌లాగే ఉంటుంది. ఆ మాటకొస్తే ఔరంగజేబు నిర్మించిన అతి పెద్ద కట్టడం కూడా ఇదే ! ఔరంగజేబు మొదటి భార్య రబియా ఉద్‌ దౌరాని సమాధి ఇది.. ఔరంగజేబు కాలంలోని ముఖ్యమైన నిర్మాణం ఇదే! దీన్ని పేదవాడి తాజ్‌మహల్ అంటారు. తండ్రి షాజహాన్‌ తాజ్‌మహల్‌ కట్టాడన్న పంతమో... నిజంగానే తన భార్య మీద ప్రేమో ...తన పేరిటా ఓ నిర్మాణం ఉండాలన్న కోరికో తెలియదు కానీ మొత్తానికి ఔరంగజేబు ఓ మినీ తాజ్‌మహల్‌ అయితే కట్టేశాడు.. స్మారక నిర్మాణాలపై ఎలాంటి ఆసక్తి...అభిరుచి లేని ఔరంగజేబు ఈ సౌధాన్ని నిర్మించాడంటే భార్య మీద అంతో ఇంతో ప్రేమ ఉన్నట్టే అనుకోవాలి..

తాజ్‌మహల్‌లా ఉంటుంది కాబట్టే దీన్ని దక్కనీ తాజ్‌ అంటారు. దీనికి రాళ్లు ఎత్తిన కూలీలెవరో తెలియదు కానీ.. వాస్తుశిల్పి మాత్రం అతా ఉల్లా ఇంజనీర్‌ హన్స్‌పత్‌ రాయ్‌.. అతా ఉల్లా ఎవరో కాదు. తాజ్‌మహల్‌కు ప్రధాన వాస్తుశిల్పిగా వ్యవహరించిన ఉస్తాద్‌ అహ్మద్‌ లహౌరి కుమారుడు.. క్రీస్తుశకం 1651-1661 మధ్య కాలంలో బీబీ కా మఖ్బారాను నిర్మించి ఉంటారు. గులామ్‌ ముస్తఫా రాసిన తారీఖ్‌ నామ ప్రకారం ఈ నిర్మాణానికి అయిన ఖర్చు 6,68,203 రూపాయల ఏడు అణాలు.. ఓస్‌....ఇంతేనా అని అనుకుంటారేమో ...అయిదు శతాబ్దాల కిందట ఇది చాలా పెద్దమొత్తం. నిర్మాణానికి జైపూర్‌ నుంచి పాలరాయిని తెప్పించారు. తాజ్‌మహల్‌తో పోలిక పెట్టకుండా చూస్తే మాత్రం బాగానే ఉంటుంది. నాలుగు వైపులా పాలరాతి మీద చెక్కిన శిల్పాలు ఉన్నాయి.. పైన ఉన్న డోమ్‌ను కూడా చక్కటి నగిషీతో తీర్చిదిద్దారు. ఇందులో ఓ పక్కన నిజాం రాజులు ప్రార్థనల కోసం ఓ పెద్ద హాల్‌ను నిర్మించారు. మొత్తంమీద దక్కనీ తాజ్‌మహల్‌ చూడతగ్గ ప్రేమ సౌధమే!

Updated On 13 Feb 2023 5:15 AM GMT
Ehatv

Ehatv

Next Story