వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ మొదలైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ..
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ మొదలైంది. బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ(NDA).. కాంగ్రెస్(Congress) సారథ్యంలోని ఇండియా(I-N-D-I-A) కూటమిల మధ్య పోరు హోరాహోరిగా జరుగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనాలు ఎవరి పక్షాన ఉంటారు.. ఈ రెండు కూటమిలు ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయనేదానిపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా ఏబీపీ న్యూస్-సీ ఓటర్(ABP News C-Voter Survey) నిర్వహించిన సర్వే ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై ఓ క్లారీటీ వచ్చింది.
సర్వే ప్రకారం.. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి 295 నుండి 335 వరకు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇండియా కూటమికి 165 నుంచి 205 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతర పార్టీలు 35 నుంచి 65 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంటే దేశంలో మూడోసారి మోదీ ప్రభుత్వం(Modi Govt) అధికారాన్ని ఏర్పాటు చేయనుందని స్పష్టంగా తెలుస్తుంది.
సర్వే ప్రకారం.. ఉత్తర భారతదేశం(North India)లోని 180 సీట్లలో NDA 150 నుండి 169 సీట్లు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి 20 నుండి 30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో ఇతర పార్టీలకు 1 నుంచి 5 సీట్లు వస్తాయని వెల్లడించింది.
దక్షిణ భారతదేశం(South India)లో NDA కు ఈసారి నిరాశే ఎదురవుతుందని సర్వే పేర్కొంది. దక్షిణాదిలోని 132 సీట్లలో ఎన్‌డీఎల్‌ఏ 20 నుంచి 30 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. ఇక దక్షిణాదిలో..ఇండియా కూటమికి 70 నుంచి 80 సీట్లు పొందే అవకాశం ఉందని పేర్కొంది. ఇతర పార్టీలు 25 నుంచి 35 స్థానాలు దక్కించుకోనున్నట్లు తెలిపింది.
సర్వే ప్రకారం ఈశాన్య భారతదేశం(Northeast India)లోని 130 సీట్లలో ఎన్డీఏకు 80 నుంచి 90 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇండియా కూటమి 50 నుంచి 60 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇతర పార్టీలు ఈశాన్య భారతంలో 10 నుంచి 20 స్థానాలను పొందే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఈ సారి NDA, INDIA కూటముల మధ్య అక్కడక్కడ హోరాహోరీ పోరు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.