తెలంగాణ(Telangana) సరిహద్దులో ఉన్న రాయచూర్ శక్తినగర్(Shaktinagar) సమీపంలో కృష్ణా నది(Krishna River)పై వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా జరిగిన తవ్వకాలలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. దశావతారాలతో కూడిన విష్ణుమూర్తి విగ్రహం, ఓ శివలింగం తాజాగా దొరికాయి. కృష్ణానది తీరంలో బయటపడిన ఈ విష్ణుమూర్తి విగ్రహం 11వ శతాబ్దానికి చెందినది కావచ్చని రాయచూర్ యూనివర్సిటీ(Raichur University)లోని చరిత్ర, పురావస్తు శాఖ అధ్యాపకులు డాక్టర్ పద్మజ దేశాయ్(Padmaja Desai) అంటున్నారు. కళ్యాణ చాళుక్యుల కాలంలోనిదని చెప్పారు.
తెలంగాణ(Telangana) సరిహద్దులో ఉన్న రాయచూర్ శక్తినగర్(Shaktinagar) సమీపంలో కృష్ణా నది(Krishna River)పై వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా జరిగిన తవ్వకాలలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. దశావతారాలతో కూడిన విష్ణుమూర్తి విగ్రహం, ఓ శివలింగం తాజాగా దొరికాయి. కృష్ణానది తీరంలో బయటపడిన ఈ విష్ణుమూర్తి విగ్రహం 11వ శతాబ్దానికి చెందినది కావచ్చని రాయచూర్ యూనివర్సిటీ(Raichur University)లోని చరిత్ర, పురావస్తు శాఖ అధ్యాపకులు డాక్టర్ పద్మజ దేశాయ్(Padmaja Desai) అంటున్నారు. కళ్యాణ చాళుక్యుల కాలంలో(Kalyana Chalukyas dynasty) నిదని చెప్పారు. రాయచూరు, హంపి(Hampi) పరిసరాల్లోని 30 గ్రామలలో ప్రాచీన దేవాలయాలపై పీహెచ్‌డీ చేశారు పద్మజ దేశాయ్. ఆ ప్రాంతంలో తాము పలు విగ్రహాలు చూశామని గ్రామస్తులు చెప్పేవారు. నదిలో నీటిమట్టం తక్కువగా ఉండటం వల్ల కొన్ని విగ్రహాలు అందరికీ కనిపించాయి. అయోధ్య రామమందిరంలోని రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్ చెక్కిన సంగతి తెలిసిందే కదా! ఈ నేపథ్యంలో రాయచూరుకు సమీపంలో బయటపడ్డ విగ్రహాన్ని చాలామంది రామ్ లల్లా విగ్రహంతో పోలుస్తూ రెండూ ఒకే రకంగా ఉన్నాయన్నారు. తన అంచనా ప్రకారం ఈ విగ్రహం వెంకటేశ్వరుడిది అయ్యేందుకు అవకాశముందని పద్మజ దేశాయ్ అంటున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు.'విగ్రహం దొరికిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు కావడం.. ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడి ఆరాధన ఎక్కువగా ఉండటం. ఇక విగ్రహ లక్షణాలను గమనిస్తే దీనిపై శంఖు, చక్రాలు అన్నాయి. తిరుపతి వెంకటేశ్వరుడిలాగే అభయ, వరద హస్తాలు ఉన్నాయి. కళ్యాణ చాళుక్యుల కాలంలో అటు శైవారాధనతోపాటు వైష్ణవారాధన కూడా జరిగేది. ఇందుకు తగ్గట్టుగా ఈ విష్ణుమూర్తి విగ్రహం బయటపడ్డ ప్రాంతంలోనే శివలింగమూ లభించింది. ముఖ్యమైన విషయమేమిటంటే ఈ విగ్రహాలు బయటపడ్డ చోట ఆలయం లాంటివి ఏమీ లేకపోవడం’ అని డాక్టర్ పద్మజ దేశాయ్ వివరించారు.