ఉత్తరప్రదేశ్‌లోని(UttarPradesh) వారణాసిలో ఉన్న జ్ఞానవాపి(Gyanavapi Mosque) మసీదులోని నేలమాళిగలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే పూజలు మొదలయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని(UttarPradesh) వారణాసిలో ఉన్న జ్ఞానవాపి(Gyanavapi Mosque) మసీదులోని నేలమాళిగలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే పూజలు మొదలయ్యాయి. వ్యాస్‌కా తెహఖానా అంటే వ్యాసుని నేలమాళిగలో ఉదయం మూడు గంటలకే విగ్రహాలకు(Idol) తొలి పూజ జరిగింది. వారంలోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ చెప్పినప్పటికీ వెంటనే ఆ ఏర్పాట్లు పూర్తి చేసి పూజలు మొదలు పెట్టింది. విశ్వనాథుడి ఆలయ(Vishwanath temple) పూజారి మంగళహారుతులు ఇచ్చారు. రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీద్ సమీపంలో మందిర్ నే బోర్డును అంటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. బాబ్రీ విధ్వంసం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి ప్రాంతాన్ని సీజ్ చేయించారు. హిందువులు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఒక్కరికీ ఇక్కడ పూజలు చేసే హక్కు ఉంది అని హిందు పక్షం తరఫున కోర్టులో వాదనలు వినిపించిన విష్ణు శంకర్ జైన్ చెబుతున్నారు.