వారణాసిలోని జ్ఞాన్‌వాపి ప్రాంగణంలోని దక్షిణ సెల్లార్‌లో పూజలు చేసేందుకు హిందువులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ

జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్‌ కా తేకానాలో హిందువుల పూజలకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ(ఏఐఎంసీ) పిటిషన్‌ను జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ బెంచ్‌ కొట్టివేసింది. నాలుగు రోజుల పాటు పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న కోర్టు రిజర్వ్‌ చేసింది.

వారాణాసి కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ (ఏఐఎంసీ) అభ్యర్థనను తాజాగా తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయాలని ఏఐఎంసీ నిర్ణయించింది. తుది వాదనలు విన్న జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పుపై హిందూ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్‌ విచారించేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. అయితే.. వారణాసిలోని జ్ఞాన్‌వాపి ప్రాంగణంలోని దక్షిణ సెల్లార్‌లో పూజలు చేసేందుకు హిందువులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

Updated On 26 Feb 2024 12:13 AM GMT
Yagnik

Yagnik

Next Story