హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్ సుఖు సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ సేల్స్‌పై కౌసెస్ విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇప్పట్నుంచి లిక్కర్ బాటిల్‌పై అదనంగా పది రూపాయల చొప్పున వసూలు చేస్తారు.
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్ సుఖు సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ సేల్స్‌పై కౌసెస్ విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇప్పట్నుంచి లిక్కర్ బాటిల్‌పై అదనంగా పది రూపాయల చొప్పున వసూలు చేస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాదికి వంద కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని సుఖు తెలిపారు. ఈ వంద కోట్ల రూపాయలను గోవుల సంరక్షణకు వినియోగిస్తామన్నారు. అధిక పాల ఉత్పత్తి ద్వారా పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచడానికి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తామని చెప్పారు.
టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే హిమాచల్‌ప్రదేశ్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహసమే! మద్యం బాబులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల మండిపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికిగాను 53,413 కోట్ల రూపాయల బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20 వేలమంది బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీల కొనుగోలు నిమిత్తం ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయల రాయితీని అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక, రాష్ట్రంలో పాల ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు హిం-గంగా పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద, పశువుల పెంపకందారులకు నిజమైన ధర ఆధారిత పాల ధరలు అందించబడతాయి.