అస్సాంలో(Assam) వరదల(Floods) కారణంగా కూరగాయలు(Vegetables), ఇతర ఆహార పదార్థాల ధరలు(Food Item Prices) ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 11,000 హెక్టార్లలోని(Hectors) పంటలు(Grops) వరదల కారణంగా నాశనమయ్యాయి. దీంతో రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
అస్సాంలో(Assam) వరదల(Floods) కారణంగా కూరగాయలు(Vegetables), ఇతర ఆహార పదార్థాల ధరలు(Food Item Prices) ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 11,000 హెక్టార్లలోని(Hectors) పంటలు(Crops) వరదల కారణంగా నాశనమయ్యాయి. దీంతో రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరదల కారణంగా రవాణ వ్యవస్థ కూడా ప్రభావితమైంది. దీంతో రాష్ట్రంలో ఇతర ఆహార పదార్థాల కొరత కూడా ఉంది. అందుబాటులో ఉన్న వస్తువులేమో ఖరీదైన ధరలకు లభిస్తున్నాయి.
అసోంలో ఇప్పటి వరకు 19 జిల్లాల్లో దాదాపు 4.89 లక్షల మంది వరదల బారిన పడ్డారు. గత 24 గంటల్లో వరదల కారణంగా నల్బరి(Nalbari) జిల్లాలో ఒకరు మృతి చెందారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ASDMA) నివేదిక ప్రకారం.. ఒక్క బజాలీ జిల్లాలోనే 2.5 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ఇది కాకుండా, నల్బరిలో 80061 మంది, బార్‌పేటలో 73233 మంది, లఖింపూర్‌లో 22577 మంది, దరాంగ్‌లో 14583 మంది, తముల్‌పూర్‌లో 14180 మంది, బక్సాలో 7282 మంది, గోల్‌పరాలో 4750 మంది ప్రభావితమయ్యారు. 1,538 గ్రామాలను వరద ముంచెత్తింది.
ధుబ్రీ, జోర్హాట్ జిల్లాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరద బాధిత 14 జిల్లాల్లో 140 సహాయ శిబిరాలు, 75 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సహాయక శిబిరాల్లో 35,142 మంది ఉన్నారు. బాధిత ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డు పక్కన, ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నారు.
NDRF, SDRF, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్‌కు చెందిన వ్యక్తులు సహాయ, రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నారు. వరదల కారణంగా రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. వరద ప్రభావిత జిల్లాల్లో 213 రోడ్లు, 14 వంతెనలు, అనేక వ్యవసాయ ఆనకట్టలు, పాఠశాల భవనాలు, నీటిపారుదల కాలువలు మొదలైనవి ధ్వంసమయ్యాయి.
అస్సాంలో వరదల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah).. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మతో(Himanta Biswa Sharma) మాట్లాడారు. ఎన్‌డిఆర్‌ఎఫ్(NDRF) బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని అమిత్ షా చెప్పారు. ఈ కష్టకాలంలో అసోం ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.