మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(May Day).ఈ సందర్భంగా సగటు భారతీయుడు వేతన విలువ మన దేశంలో ఎంత ఉంది అనేది తెలుసుకుందాం . ప్రపంచదేశాల్లో మిగిలిన దేశాలతో పోలిస్తే భారతీయుల సగటు జీతం 50 వేల లోపే ఉన్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. భారతదేశంతో(India) పాటు, ఈ నివేదికలో, ప్రపంచంలోని ఇతర దేశాల పౌరుల సగటు నెలవారీ జీతం(Monthly Salary) గురించి సమాచారం కూడా ఇవ్వటం జరిగింది.ఈ జాబితాలో సగటు జీతం రూ. 1 లక్ష (1.lakh)కంటే తక్కువ వేతనం ఉన్న మరో 23 దేశాలు ఉన్నాయి.

అత్యధిక జీతన్నిచ్చే టాప్ 10 దేశాలు ఇవే !
వరల్డ్ స్టాటిస్టిక్స్ (World Statistics)డేటా అందించిన సమాచారం ప్రకారం, ప్రపంచంలోని 10 దేశాలు ప్రజలకు అత్యధిక సగటు జీతం ఇస్తున్నాయి. ఇందులో స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, సింగపూర్, USA, ఐస్లాండ్, ఖతార్, డెన్మార్క్, UAE, నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉన్నాయి.
సగటు జీతం లక్ష కన్నా తక్కువ జీతం ఇచ్చే దేశాల్లో టర్కీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, కొలంబియా, బంగ్లాదేశ్, వెనిజులా, నైజీరియా, ఈజిప్ట్, పాకిస్తాన్ వంటి దేశాలు భారతదేశం కంటే తక్కువ వేతనాన్ని ఇస్తున్నాయి . నెలవారీ వేతనాల విషయంలో భారత్(Bharat) 65వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్(Pakistan) 104వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో అమెరికా (America)4వ స్థానంలో ఉండగా, చైనా(china) 44వ స్థానంలో ఉంది.
ఈ దేశాల్లో 4 లక్షలకు పైగా జీతం:
ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో పౌరులు అత్యధిక జీతం పొందుతారు. వారి సగటు నెలసరి జీతం రూ.4 లక్షల కంటే ఎక్కువ. అవి ఏ దేశాలంటే ?స్విట్జర్లాండ్ ఇక్కడ సగటుజీతం రూ. 4,98,567, లక్సెంబర్గర్లు సగటున నెలవారీ జీతం రూ. 4,10,156 , సింగపూర్ వాసులు నెలకు రూ. 4,08,030 పొందుతున్నారు.
జీతం లక్ష కన్నా జీతం తక్కువ ఇచ్చే దేశాలు ఇవే :
భారతదేశం: $573 (రూ. 46,861)
టర్కీ: $486 (రూ. 39,746)
బ్రెజిల్: $418 (రూ. 34,185)
అర్జెంటీనా: $415 (రూ. 33,939)
ఇండోనేషియా: $339 (రూ. 27,724)
కొలంబియా: $302 (రూ. 24,698)
బంగ్లాదేశ్: $255 (రూ. 20,854)
వెనిజులా: $179 (రూ. 14,639)
నైజీరియా: $160 (రూ. 13,085)
ఈజిప్ట్: $145 (రూ. 11,858)
పాకిస్థాన్: $145 (రూ. 11,858)