అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ వారిని పంట పొలాల్లోకి లాక్కెల్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ అమానవీయమైన సంఘటనను చూసి చలించనివారు ఉండరు. సహాయం కోసం వాళ్లు దీనంగా ప్రాధేయపడుతుంటే,

మణిపూర్‌పై మొదటిసారి పెదవి విప్పిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ వారిని పంట పొలాల్లోకి లాక్కెల్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ అమానవీయమైన సంఘటనను చూసి చలించనివారు ఉండరు. సహాయం కోసం వాళ్లు దీనంగా ప్రాధేయపడుతుంటే, కేకలు పెడుతుంటే చుట్టూ ఉన్న మూక వాళ్లను ఇష్టానుసారం తాకుకూ వేధించడం వీడియోలో కనిపిస్తోంది. ఆపై వాళ్లను పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళుతున్న మరో వీడియో వైరల్‌ అయ్యింది. అయితే ఆపై ఆ ఇద్దరిపై సామూహిక అత్యాచారం జరిగిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇన్ని రోజులుగా మణిపూర్‌పై పెదవి విప్పని ప్రధాని నరేంద్రమోదీ ఇక గత్యంతరం లేక మణిపూర్‌ ఘటనపై స్పందించాల్సి వచ్చింది. మణిపూర్‌ ఘటన బాధకరమని మోదీ చెప్పుకొచ్చారు. మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, మహిళలను వేధించిన వారిని వదిలేది లేదన్నారు. మరోవైపు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా మొదటిసారి మణిపూర్‌పై స్పందించారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లా పరిధిలో మే 4వ తేదీన ఈ ఘటన జరిగిందని ఆదివాసీ గిరిజన నేతల సంఘం -ఐటీఎల్‌ఎఫ్‌ చెబుతోంది. పోలీసులు మాత్రం ఈ ఘటన మరో చోట జరిగిందని, ఎఫ్‌ఐఆర్‌ మాత్రం కాంగ్పోక్పలో నమోదయ్యిందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ కూడా స్పందించాల్సి వచ్చింది. హైప్రొఫైల్‌ కేసుగా దీనిని దర్యాప్తు చేపట్టాలని మణిపూర్‌ పోలీస్‌ శాఖను ఆదేశించారు.

Updated On 20 July 2023 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story