కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అధికార బీజేపీ దూకుడుకు చెక్ పెట్టింది. ఏకంగా 135 స్థానాలలో గెలిచి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక ఈ ఎన్నికలలో చాలామంది తక్కువ మార్జిన్‌తో గెలవడం గమానార్హం. జయనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగాంది.

High drama at counting centre for Jayanagar constituency as BJP wins by 16 votes
కర్ణాటక ఎన్నికల ఫలితాలు(Karnataka Election Results) వెలువడ్డాయి. కాంగ్రెస్(Congress) అధికార బీజేపీ(BJP) దూకుడుకు చెక్ పెట్టింది. ఏకంగా 135 స్థానాలలో గెలిచి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక ఈ ఎన్నికలలో చాలామంది తక్కువ మార్జిన్‌తో గెలవడం గమానార్హం. జయనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి(C.K. Ramamurthy) కాంగ్రెస్ అభ్యర్థిని సౌమ్యారెడ్డి(Sowmya Reddy)పై 16 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
జయనగర్(Jaya Nagar)లోని ఎస్‌ఎస్‌ఎంఆర్‌వి(SSMRV) కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలోని అధికారులు నిన్న అర్థరాత్రి ఫలితాలను ప్రకటించారు. మెజారిటీ చాలా తక్కువగా ఉన్నందున.. రామ్‌మూర్తి ఓట్లను తిరిగి లెక్కించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్(DK Shiva Kumar), వర్కింగ్ ప్రెసిడెంట్, సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి(Ramalinga Reddy) నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. రామమూర్తికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 16 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో రామమూర్తి విజేతగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో 224 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం.. బీజేపీ 66 సీట్లు గెలుచుకోగా, జేడీఎస్(JDS) 19 సీట్లు గెలుచుకుంది.
