తమిళ అగ్రనటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్(Vijaykanth) అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని మియాట్(Miot) ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చేరిన విజయకాంత్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన చనిపోవడానికి కొద్ది సేపటికి క్రితమే ఆయనకు కరోనా(Corona) సోకినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంచి మనసును స్మరించుకున్నారు.

vijaykanth
తమిళ అగ్రనటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్(Vijaykanth) అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని మియాట్(Miot) ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చేరిన విజయకాంత్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన చనిపోవడానికి కొద్ది సేపటికి క్రితమే ఆయనకు కరోనా(Corona) సోకినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంచి మనసును స్మరించుకున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో విజయకాంత్ గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారి ఖననానికి తన సొంత స్థలం ఇస్తానని ప్రకటించారు. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు చెన్నైకు(Chennai) చెందిన ఓ డాక్టర్‌కు వైరస్ సోకి చనిపోయాడు. ఆయన మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లినప్పుడు స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న విజయకాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో మృతిచెందిన వారిని ఖననం చేయడానికి తన సొంత స్థలం ఇస్తానన్నారు.తన ఆండాళ్ అళగర్(Andal Alagar) ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలోని కొంత భాగాన్ని ఖననానికి ఇస్తున్నట్లు తెలిపారు. కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేయడం వల్ల వైరస్ వ్యాపించెందదని చెబుతూ, ఈ విషయంలో ప్రభుత్వం(Government) ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
