అయోధ్యలో(ayodhya) రామాలయం(Ram Mandhir) ప్రారంభమయ్యింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం మధ్యహ్నం 12: 29 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది.
అయోధ్యలో(ayodhya) రామాలయం(Ram Mandhir) ప్రారంభమయ్యింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం మధ్యహ్నం 12: 29 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహ ప్రాణ ప్రతిష్టపై చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో(Social media) స్పందించారు. టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్‌బాబు(Mahesh babu) కూడా రియాక్టయ్యారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ' చరిత్ర యొక్క ప్రతిధ్వనులు, విశ్వాసం యొక్క పవిత్రత మధ్య, అయోధ్యలో రామ మందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత, ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది' అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.