అయోధ్య(Ayodhya) ఆలయం ప్రారంభమై 11 రోజులైంది. ఇప్పటికే రామ మందిరాన్ని(Ram Mandir) 25 లక్షల మంది దర్శించుకున్నారు. దీంతో అక్కడి హుండీ కళకళాడుతోంది. రామజన్మభూమి తీర్థ క్షేత్రంలో గత 10 రోజుల్లో సుమారు ₹8 కోట్లు(8Crs) విరాళాలు వచ్చాయి. ఆన్‌లైన్‌లో(Online) సుమారు ₹3.50 కోట్లు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టు కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా(Prakash Guptha) మాట్లాడుతూ స్వామి కొలువై ఉన్న గర్భగుడి ముందు దర్శన మార్గానికి సమీపంలో నాలుగు పెద్ద సైజు విరాళాల హుండీల్లో(Hundi) భక్తులు విరాళాలు వేస్తున్నారని తెలిపారు.

అయోధ్య(Ayodhya) ఆలయం ప్రారంభమై 11 రోజులైంది. ఇప్పటికే రామ మందిరాన్ని(Ram Mandir) 25 లక్షల మంది దర్శించుకున్నారు. దీంతో అక్కడి హుండీ కళకళాడుతోంది. రామజన్మభూమి తీర్థ క్షేత్రంలో గత 10 రోజుల్లో సుమారు ₹8 కోట్లు(8Crs) విరాళాలు వచ్చాయి. ఆన్‌లైన్‌లో(Online) సుమారు ₹3.50 కోట్లు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టు కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా(Prakash Guptha) మాట్లాడుతూ స్వామి కొలువై ఉన్న గర్భగుడి ముందు దర్శన మార్గానికి సమీపంలో నాలుగు పెద్ద సైజు విరాళాల హుండీల్లో(Hundi) భక్తులు విరాళాలు వేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లలో కూడా ప్రజలు విరాళాలు ఇస్తున్నారని వివరించారు. 11 మంది బ్యాంకు ఉద్యోగులు(Bank employees), ముగ్గురు ఆలయ ట్రస్టు ఉద్యోగులు సహా 14 మంది ఉద్యోగుల బృందం కానుకలను లెక్కిస్తున్నారు. సీసీ కెమెరాల(CCTV) నిఘాలో లెక్కింపు జరుగుతోందని గుప్తా తెలిపారు. గత 11 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు రామాలయానికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకున్నారని తెలిపారు.

అంతేకాకుండా రామమందిరం ప్రాంతంలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన బిజోలియా రాళ్లపై భక్తులు హాయిగా నడిచే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. రాజస్థాన్‌లోని(Rajasthan) ఈ బిజోలియా రాయి దాని నాణ్యతలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది వేసవిలో చాలా వేడిగా ఉండదు. శీతాకాలంలో చాలా చల్లగా ఉండదు. ఈ రాయి సుమారు వెయ్యి ఏళ్ల వరకు క్షీణించదు. ఇది రాళ్ల కంటే నీటిని గ్రహించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

Updated On 2 Feb 2024 5:54 AM GMT
Ehatv

Ehatv

Next Story