హేమంత్ సోరెన్(Hemanth Soren) ఈరోజు రాంచీలోని(Ranchi) తన నివాసంలో ఎమ్మెల్యేలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హేమంత్ సోరెన్ సమావేశానికి సంబంధించి ఊహాగానాలు భారీగా ఉన్నాయి.

హేమంత్ సోరెన్(Hemanth Soren) ఈరోజు రాంచీలోని(Ranchi) తన నివాసంలో ఎమ్మెల్యేలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హేమంత్ సోరెన్ సమావేశానికి సంబంధించి ఊహాగానాలు భారీగా ఉన్నాయి. ఈ సమావేశంలో హేమంత్ సోరెన్ సీఎం కుర్చీలో కూర్చునే విష‌య‌మై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చ‌ర్చ న‌డుస్తుంది.

ఈ స‌మావేశానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇండియా కూట‌మి(INDIA Alliance) ఎమ్మెల్యేలందరూ హాజ‌ర‌య్యారు. ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్(champai soren), జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకున్నారు. హేమంత్ సోరెన్‌తో గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ సమావేశమైన పోటోలు బయటకు వ‌చ్చాయి.

రాంచీలో జరిగే ఈ సమావేశానికి INDA ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ముందుగానే హేమంత్ సోరెన్ కోరినట్లు నివేదిక‌లు వెల్లిడించాయి. దీంతో సీఎం చంపై సోరెన్ కూడా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

ఈ విష‌య‌మై ఛత్రా RJD ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి సత్యానంద్ భోక్తా మాట్లాడుతూ.. హేమంత్ సోరెన్ మరోసారి శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడం ఖాయమని వెల్లడించారు. శాసనసభా పక్ష సమావేశంలో హేమంత్ సోరెన్‌ను నాయకుడిగా ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. దీని తర్వాత చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. చంపాయ్‌ సోరెన్‌ రాజీనామా తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హేమంత్ సోరెన్‌తో పాటు ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు. మంత్రుల జాబితాలో తన పేరు కూడా ఉందని పేర్కొన్నారు.

Eha Tv

Eha Tv

Next Story