సార్వత్రిక ఎన్నికలకు(General Elections) సమయం దగ్గరపడింది. రాజకీయపార్టీలు వ్యూహరచనలో పడ్డాయి. పొత్తులు పెట్టుకుంటున్నాయి. కూటములు కడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్నాయి. మ్యానిఫెస్టోలను(Manifesto) పకడ్బందీగా రూపొందించడానికి కసరత్తులు చేస్తున్నాయి. మరోవైపు ఈసారి నాలుగు వందలపై చిలుకు లోక్‌సభ సీట్లను సాధించాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. అందుకు తగిన ఎత్తుగడలను వేస్తున్నది.
సార్వత్రిక ఎన్నికలకు(General Elections) సమయం దగ్గరపడింది. రాజకీయపార్టీలు వ్యూహరచనలో పడ్డాయి. పొత్తులు పెట్టుకుంటున్నాయి. కూటములు కడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్నాయి. మ్యానిఫెస్టోలను(Manifesto) పకడ్బందీగా రూపొందించడానికి కసరత్తులు చేస్తున్నాయి. మరోవైపు ఈసారి నాలుగు వందలపై చిలుకు లోక్‌సభ సీట్లను సాధించాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. అందుకు తగిన ఎత్తుగడలను వేస్తున్నది. వారం, పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్(Election schedule) రానుంది. ఒకప్పుడంటే ఏమో కానీ, ఇప్పుడు అన్నింటా వేగం పెరిగింది. చివరికి ఎన్నికల ప్రచారంలో(Election Campaign) కూడా స్పీడ్ వచ్చేసింది. కార్లు, బస్సుల్లో వెళితే సమయం వృధా అవుతున్నదని, గాలిమోటార్లలో(Helicopter) వెళితే వీలైనన్ని సభలు, రోడ్ షోలను కవర్ చేయవచ్చని నాయకులు అనుకుంటున్నారు. ఈ కారణంగానే ప్రయివేటు జెట్లు, హెలికాఫ్టర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఎన్నికలకు చాన్నాళ్ల ముందే వీటిని బుక్ చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు! కిందటి ఎన్నికలతో పోలిస్తే ఈసారి 40 శాతం పెరుగుదల కనిపిస్తున్నదట! ఫిక్స్‌డ్-వింగ్ విమానాలతో పోలిస్తే హెలికాఫ్టర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకు కారణం హెలికాఫ్టర్ అయితే మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోవచ్చు. ల్యాండింగ్ సమస్యలు పెద్దగా ఉండవు. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా విమానాలు, హెలికాఫ్టర్లు లేవు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొంతమంది రెండు మూడు నెలల పాటు వీటిని లీజ్‌కు తీసుకుంటున్నారు. ఛార్డట్ విమానాలు, ప్రయివేటు జెట్లు, హెలికాఫ్టర్ సేవలకు గంటల లెక్కన ఛార్జీలు వసూలు చేస్తారు. విమాన ఛార్జీ గంటలకు నాలుగున్నర లక్షల రూపాయల నుంచి 5.25 లక్షల రూపాయల వరకు ఉంటుంది! అదే హెలికాఫ్టర్ అయితే గంటకు లక్షన్నర రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. నిరుడు డిసెంబరు నాటికి మన దేశంలో 112 నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు ఉన్నాయి. ఈ కంపెనీలు అవసరాన్ని బట్టి విమాన సేవలను అందిస్తుంటాయి. అన్నిచోట్లా ఉన్నట్టే ఇక్కడ కూడా బ్రోకర్లు ఉంటారు. వారు ముందుగానే విమానాలను, హెలికాఫ్టర్లను బుక్ చేసుకుంటారు. తిరిగి వాటిని కావాల్సిన వారికి ఎక్కువ మొత్తాన్ని తీసుకుని రెంట్‌కు ఇస్తుంటారు. అన్నట్టు హెలికాఫ్టర్లకు ఈ సీజన్‌లో మస్తు డిమాండ్ ఉంటుంది. అందుకే గంటలకు మూడున్నర లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా కొందరు నేతలు, కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.