అది ప్రేమకు చిహ్నం. ప్రపంచంలోని ఏడు వింతలలో(seven wonders) ఒకటిగా ప్రసిద్ధి పొందిన పాలరాతి మందిరం!
అది ప్రేమకు చిహ్నం. ప్రపంచంలోని ఏడు వింతలలో(seven wonders) ఒకటిగా ప్రసిద్ధి పొందిన పాలరాతి మందిరం! అదే ఆగ్రాలో(Agra) వెలిసిన తాజ్‌మహల్(Taj mahal).. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఆ కట్టడం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఫలితంగా చలువరాతి మందిరంలోని గోడలు, ఫ్లోరింగ్ పలు చోట్ల దెబ్బతింటోంది. పగుళ్లు(Cracks) కూడా ఏర్పడుతున్నాయి. ఇటీవల ఆగ్రాలో కురిసిన భారీ వర్షం(Heavy raisn) కారణంగా ఈ పగుళ్లు మరింత పెరిగాయి. ఇంతకు ముందు ప్రధాన గోపురం చుట్టూ ఉన్న తలుపుపై అరబిక్‌లో ఖురాన్ పంక్తులు ఉండేవి. ఇప్పుడు అవి చెరిగిపోయాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా గోడలపై పొదిగిన విలువైన రాళ్లు కూడా అవసాన దశకు చేరుకుంటున్నాయి. కొన్నింటిని పెకిలించి తీసుకెళుతున్నారు. పడమర దిశలో కట్టడానికి ఎదురుగా ఉన్న ఫ్లోరింగ్‌పై రాళ్లు పగిలిపోయాయని, ప్రధాన సమాధి ప్రాంతం, ప్రధాన గుమ్మటం దగ్గర గోడలు దెబ్బతిన్నాయని టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి షకీల్ చౌహాన్ చెప్పారు. మరోవైపు ప్రస్తుతం తాజ్‌మహల్ కట్టడానికి సంబంధించి ఎలాంటి తీవ్ర సమస్యలు లేవని చెబుతున్నారు తాజ్‌మహల్ నిర్వహణను చూస్తున్న భారత పురావస్తు సంస్థ (ఏఎస్‌ఐ) అధికారులు. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షానికి తాజ్‌మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీరు కారింది. కట్టడం ముందు ఉన్న తోట కూడా నీటిలో మునిగింది.