భరణి కార్తెలో బండలు పగిలేంత ఎండలుంటాయంటారు. బండలు పగలడంలేదు కానీ రైతుల గుండెలు పగులుతున్నాయి. అందుకు కారణం అకాల వర్షాలు.. ఎండకాలంలో కురుస్తున్న వానలు. ఒక్కరోజు, రెండు రోజులు కాదు. అయిదారు రోజులుగా ఇవే వానలు! రాబోయే మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు కూడా హైదరాబాద్‌(Hyderabad) సహా తెలంగాణ(Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండాలని తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి తెలంగాణ, కర్ణాటక మీదుగా కొనసాగుతోంది.

భరణి కార్తెలో బండలు పగిలేంత ఎండలుంటాయంటారు. బండలు పగలడంలేదు కానీ రైతుల గుండెలు పగులుతున్నాయి. అందుకు కారణం అకాల వర్షాలు.. ఎండకాలంలో కురుస్తున్న వానలు. ఒక్కరోజు, రెండు రోజులు కాదు. అయిదారు రోజులుగా ఇవే వానలు! రాబోయే మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు కూడా హైదరాబాద్‌(Hyderabad) సహా తెలంగాణ(Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండాలని తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి తెలంగాణ, కర్ణాటక మీదుగా కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులలో కూడా భారీ వర్షాలు పడతాయి. తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌(orange alert) జారీ చేసింది. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వడగళ్లు పడే ఛాన్స్‌ కూడా ఉంది. ఇక రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

Updated On 2 May 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story