బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే రేగా కాంతారావు(Rega Kantha Rao), కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Podem Veeraiah) కొట్టుకునేంతగా ఘర్షణ పడ్డారు. అధికారులు అడ్డుకుని సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.భద్రాద్రి కొత్తగూడెం(Kotha gudem) జిల్లా లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘర్షణ జరిగింది.
బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే రేగా కాంతారావు(Rega Kantha Rao), కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Podem Veeraiah) కొట్టుకునేంతగా ఘర్షణ పడ్డారు. అధికారులు అడ్డుకుని సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.భద్రాద్రి కొత్తగూడెం(Kotha gudem) జిల్లా లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘర్షణ జరిగింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటాపెరిగి రాద్ధాంతంగా మారింది.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతుండగా అభ్యంతరం వ్యక్తం చేశారు పొదెం వీరయ్య. ఇది ప్రభుత్వ కార్యక్రమమని ఇందులో బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ అడ్డుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. 'మా ప్రభుత్వ ఘనతలను మేం కచ్చితంగా చెప్పుకుంటాం.. ఇదేమన్నా మీ ఏరియానా' అంటూ రేగా కాంతారావు మండిపడ్డారు. 'మీరు చేసిన పనులుంటే మీరు చెప్పుకోండి ఎవరొద్దన్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేగా కాంతారావు. అలా మాటా మాటా పెరిగి ఒకరి మీదకు ఒకరు వెళ్లగా.. అధికారులు అడ్డుకుని సర్ధిచెప్పారు. ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.