దేశంలో కరోనా వైరస్ (corona virus)ప్రమాదఘంటికలను మోగిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఫోర్త్ వేవ్ ముంచుకురావడం ఖాయమనిపిస్తోంది. వరుసగా మూడో రోజు కూడా మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేందర వైద్య ఆరోగ్యశాఖ (Health Ministry Of India) లేటెస్ట్‌గా వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 59,512 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా, వారిలో 3,641 మందికి కరోనా సోకినట్టు తేలింది.
దేశంలో కరోనా వైరస్ (corona virus)ప్రమాదఘంటికలను మోగిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఫోర్త్ వేవ్ ముంచుకురావడం ఖాయమనిపిస్తోంది. వరుసగా మూడో రోజు కూడా మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేందర వైద్య ఆరోగ్యశాఖ (Health Ministry Of India) లేటెస్ట్‌గా వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 59,512 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా, వారిలో 3,641 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 4.47 కోట్లకు చేరింది. యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య 20 వేలు దాటింది. ప్రస్తుతం 20,219 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా వైర్ నుంచి 4.42 కోట్ల మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 11 మంది కరోనాతో కన్నుమూశారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,892కు చేరింది. ఇప్పటి వరకు నమోదైన కేసులలో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 220,66,12,500 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. మరోవైపు కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.