సాధారణంగా మనం ఏదో ఒక సందర్భంలో మందులు(Medicine) కొంటుంటాం. ఇంట్లోవారికైనా ఉండొచ్చు, లేదా మనకోసమైనా మందులను కొంటుంటాం. అయితే ఆ మందుల స్ట్రిప్‌పై ఒక రెడ్ మార్క్(Red Mark) ఉండడాన్ని గమనిస్తాం.. కానీ ఆ.. ఏదోలే అని వదిలేస్తాం. కానీ దానిని ఎందుకు పెట్టారోనని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయం. ఒకరిద్దరు కస్టమర్లు మెడికల్ షాప్ నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినా సమాధానం దొరికే అవకాశం లేదు.
సాధారణంగా మనం ఏదో ఒక సందర్భంలో మందులు(Medicine) కొంటుంటాం. ఇంట్లోవారికైనా ఉండొచ్చు, లేదా మనకోసమైనా మందులను కొంటుంటాం. అయితే ఆ మందుల స్ట్రిప్‌పై ఒక రెడ్ మార్క్(Red Mark) ఉండడాన్ని గమనిస్తాం.. కానీ ఆ.. ఏదోలే అని వదిలేస్తాం. కానీ దానిని ఎందుకు పెట్టారోనని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయం. ఒకరిద్దరు కస్టమర్లు మెడికల్ షాప్ నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినా సమాధానం దొరికే అవకాశం లేదు. ఎందుకంటే వారు.. డ్రగ్స్(Drugs) అమ్మడంలోనే ఎక్స్‌పర్ట్.. ఇలాంటి వాటిపై కాదు కదా..! ఎవరో ఒకరు నిపుణుడు చెప్తే చెప్పే అవకాశం ఉండొచ్చు. అయితే మందుల పత్తాపై రెడ్ లైన్ ఎందుకు పెడతారో చూద్దాం...
మెడిసిన్ ఎక్స్‌పైరీ డేట్ మాదిరిగానే ఈ రెడ్ బార్ కూడా మందు గురించి వివరాలను మనకు అందిస్తుంది. 2016లో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Central health ministry)ఈ రెడ్ లైన్ గురించి అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీని గురించి వివరిస్తూ పోస్ట్ చేసింది. ఈ రెడ్ స్ట్రిప్ డిజైన్ కాదనీ, దీని వెనుక ప్రత్యేక కారణాలున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. వైద్యులను సంప్రదించకుండా మెడిసిన్ స్ట్రిప్‌పై రెడ్ లైన్ ఉన్న మందులను కొనుగోలు చేయడకూడదని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మందుల్లో యాంటీబయాటిక్స్ ఉన్నందున కచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తోనే వాడాలని దాని అర్థమని కేంద్రం తెలిపింది. డాక్టర్ సలహాతో మాత్రమే ఈ మందులను వాడాలని.. దాని కోసం మందులపై రెడ్‌లైన్ గుర్తు ఉంటుందని చెప్పారు.