భగభగమని మండుతున్న ఎండలకు(Summer) జనం తట్టుకోలేకపోతున్నారు. ఉత్తరాదిలో(North) అయితే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా చోట్ల 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూగజీవాలు సైతం ఎండలకు తట్టుకోలేక అల్లాడిపోతున్నాయి.
భగభగమని మండుతున్న ఎండలకు(Summer) జనం తట్టుకోలేకపోతున్నారు. ఉత్తరాదిలో(North) అయితే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా చోట్ల 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూగజీవాలు సైతం ఎండలకు తట్టుకోలేక అల్లాడిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బులందహార్‌లో ఓ కోతి(Monkey) వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపడిపోయింది. ఇది చూసిన వికాస్ అనే ఓ హెడ్ కానిస్టేబుల్ ఆ కోతికి సీపీఆర్(CPR) చేశాడు. ఛాతీపై నొక్కుతూ సీపీఆర్ చేసి దాన్ని స్పృహలోకి తీసుకొచ్చాడు. ఆ కోతికి బాటిల్‌తో కొన్ని నీళ్లు పట్టించాడు. తర్వాత కొన్ని నీళ్లను కోతి ఒంటిపై పోసి చల్లబరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పోలీసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.