కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆస్పత్రిలో చేరారు.
కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆస్పత్రిలో చేరారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా.. హఠాత్తుగా ముక్కు నుంచి రక్తం కారింది. కుమారస్వామి బీజేపీ నేతలతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతుండగా.. ముక్కు నుంచి రక్తం కారింది. రక్తాన్ని తుడిచేందుకు ఆయన ప్రయత్నించారు.. కానీ రక్తం ఆగలేదు.. ఆయన తెల్ల చొక్కా మీద పడింది. ఈ అనూహ్య పరిణామం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఆయనను హడావుడిగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
#WATCH | Karnataka: Union Minister HD Kumaraswamy was taken to hospital after his nose started bleeding while he was attending a press conference in Bengaluru. pic.twitter.com/yGX1pOwGVZ
— ANI (@ANI) July 28, 2024
నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. వైద్యులు చికిత్స అందిస్తున్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా తన తండ్రి విశ్రాంతి తీసుకోలేకపోవడమే ఈ ఘటనకు కారణమని నిఖిల్ తెలిపాడు. అయితే.. ఆ తర్వాత ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు హెచ్‌డి కుమారస్వామి కార్యాలయం తెలిపింది.