ఐటీ కంపెనీలకు(IT Companies) ఇప్పుడో సమస్య వచ్చింది. కరోనా వైరస్ పూర్తిగా తగ్గింది..ఇక ఆఫీసులకు రండి బాబూ అంటుంటే ఎవరూ ముందుకు రావడం లేదు. చాలా మంది ఇంటి నుంచే పని(Work from home) చేస్తామని చెబుతున్నారు. ఆఫీసులకు వెళ్లడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

hcl company
ఐటీ కంపెనీలకు(IT Companies) ఇప్పుడో సమస్య వచ్చింది. కరోనా వైరస్ పూర్తిగా తగ్గింది..ఇక ఆఫీసులకు రండి బాబూ అంటుంటే ఎవరూ ముందుకు రావడం లేదు. చాలా మంది ఇంటి నుంచే పని(Work from home) చేస్తామని చెబుతున్నారు. ఆఫీసులకు వెళ్లడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆఫీసుకు రాకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తామని చెబుతున్నా ఉద్యోగులు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే టీసీఎస్(TCS) కంపెనీ తమ ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు హెచ్‌సీఎల్(HCL) కూడా అదే పని చేసింది. ఉద్యోగులు తప్పనిసరిగా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని హెచ్‌సీఎల్ ఆదేశించింది. ఎవరైనా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే వారిపై చర్యలు తీసుకుటామని హెచ్చరించింది. ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. అంటే 19వ తేదీనుంచి ఉద్యోగులు తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయాలని ఆదేశించాయి. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే జీతం లేకుండా సెలవు తీసుకున్నట్లు (Loss Of Pay) ప్రకటించే అవకాశం ఉన్నట్లు మేనేజ్‌మెంట్ హెచ్చరించింది. ఆఫీసులకు రావడమే కాకుండా ఉత్పాదక కూడా పెంచాలని మేనేజ్‌మెంట్ చెప్పిందట! ఈ లెక్కన ఉద్యోగులు రోజుకు 8 గంటలు పనిచేయాలన్నమాట!
