ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్థానంలోకి త్వరలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ వస్తారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబీటీ) సోమవారం ప్రకటించింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆదివారం తన ఎమ్మెల్యేలతో కలిసి నాటకీయంగా బీజేపీ నేతృత్వంలోని షిండే ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.

HC to pronounce order on Sisodia’s bail plea in money laundering case today
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise Policy Case)కు సంబంధించిన ఈడీ(ED) కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) సోమవారం తీర్పు వెలువరించనుంది. ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) మీడియా మాజీ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్(Vijay Nair), హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు అభిషేక్ బోయినపల్లి(Abhishek Boinapalli), బినయ్ బాబు బెయిల్ పిటీషన్(Bail Plea)లపై కూడా హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరించనుంది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన రూస్ అవెన్యూ కోర్టు నిర్ణయాన్ని మనీష్‌తో సహా నిందితులందరూ సవాలు చేశారు. ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ(CBI) అరెస్టు చేసింది. అప్పటి నుండి ఆయన తీహార్ జైలు(Tihar Jail)లో ఉన్నారు.
