ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీ చేయకుండా ఆపాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషనర్ సుర్జీత్ సింగ్ యాదవ్..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీ చేయకుండా ఆపాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషనర్ సుర్జీత్ సింగ్ యాదవ్.. న్యాయవాదులు శశి రంజన్ కుమార్ సింగ్, మహేష్ కుమార్ ల ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కేజ్రీవాల్‌కు టైపిస్ట్‌లు, కంప్యూటర్ ప్రింటర్లు మొదలైనవాటిని అందించరాదని ఆదేశించాలని కోరారు.
అలాగే పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో కేజ్రీవాల్ జారీ చేసిన ఆదేశాలు ఢిల్లీ మంత్రి అతిషికి ఎలా చేరాయనే దానిపై విచారణ జరిపించాలనిపిటీషన్‌లో కోరారు. అరెస్టు తర్వాత కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని కోరుతూ పిటిషనర్ గతంలో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు ఆ డిమాండ్‌ను తిరస్కరించింది.
ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మతో కూడిన ధర్మాసనం విచారించనుంది. కేజ్రీవాల్ అరెస్టు చేసి ఈడీ కస్టడీకి పంపడం చట్టవిరుద్ధమని, వెంటనే విడుదల చేయాలని పిటీషన్‌లో డిమాండ్ చేశారు.
ఢిల్లీ హైకోర్టు మార్చి 21న అరెస్టుకు వ్యతిరేకంగా మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. మార్చి 22న ఈడీ కేజ్రీవాల్‌ను రూస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి 10 రోజుల రిమాండ్‌ను కోరింది. ఈడీ అభ్యర్థన మేరకు కోర్టు కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు కస్టడీకి పంపింది.