ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్‌లోని ఒక కళాశాలలో విద్యార్థినులను సీనియర్ ప్రొఫెసర్ లైంగికంగా లొంగదీసుకొని, వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ మళ్లీ మళ్లీ లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్‌లోని ఒక కళాశాలలో విద్యార్థినులను సీనియర్ ప్రొఫెసర్ లైంగికంగా లొంగదీసుకొని, వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ మళ్లీ మళ్లీ లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. హత్రాస్‌లోని సేథ్ పీజీ బాగ్లా డిగ్రీ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ రజనీష్ కుమార్ 20 ఏళ్లుగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు. 50కి పైగా అభ్యంతరకర వీడియోలు, చిత్రాలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కళాశాల యాజమాన్యం మొదట అతడిని కాపాడేందుకు ప్రయత్నించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాదించాలనే పేరుతో లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. బాలికల ఫిర్యాదులు సంవత్సరాల తరబడి బయటకు చెప్పకుండా కట్టడి చేశారు. సీఎం యోగి ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

డిపార్ట్‌మెంట్ హెడ్, చీఫ్ ప్రొక్టర్ అయిన నిందితుడు రెండు దశాబ్దాలకు పైగా తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని.. విద్యార్థినులకు ఉద్యోగాలను ఆశ చూపించి వేధిస్తున్నాడని ఆరోపించారు. బాధితులను బ్లాక్‌మెయిల్ చేయడానికి అతను వీడియోలను రికార్డ్ చేశాడని, గతంలో విద్యార్థినుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ, జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకునే వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. కమిషన్ విచారణ తర్వాత, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆరోపణలను నిర్ధారించారు. అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌తో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేవారు. అయితే ప్రొఫెసర్ అరెస్టు నుండి తప్పించుకుంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రతి దగ్గర ఎవరో ఒక చీడపురుగు ఉంటాడని.. ఏ అమ్మాయి కూడా అలాంటి అడ్వాన్సులను అంగీకరించకూడదు మరియు వెంటనే రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఈ మృగాన్ని రక్షించే వారిపై ఏమి చర్యలు తీసుకుంటారు? మరి ఈ వ్యక్తి వల్ల జీవితాలు నాశనమైన ఆ బాలికల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.

ehatv

ehatv

Next Story