ఊహించినట్టుగానే హాథ్రాస్(Hathras) తొక్కిసలాట ఘటన(stampede Incident) విషయంలో ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నాయి.
ఊహించినట్టుగానే హాథ్రాస్(Hathras) తొక్కిసలాట ఘటన(stampede Incident) విషయంలో ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్రీయ జనతాదళ్ నేత మనోజ్ ఝా(Manoj Jha) కూడా ఎత్తిచూపుతున్నారు. ఇలాంటి ప్రమాదాలపై ఎన్ని కమిటీలు వేస్తారని నిలదీశారు. రెండు రోజులు హడావుడి చేసి తర్వాత ఈ ఘటన సంగతేమర్చిపోతారన్న విషయం మనకు తెలియంది కాదని అన్నారు. భారత్ ప్రమాదాలకు నిలయంగా మారిందని మనోజ్ ఝా అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో జనం హాజరవుతారని స్ధానిక అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi adityanath) ఆదేశించారు. ఈ ఘటనలో నిందితుడు భోలే బాబా(Bholebaba) మామూలోడు కాదు. ఇతడిపై ఆగ్రా, ఎతావాహ్, కస్‌గంజ్, ఫరూఖాబాద్, దుసా ప్రాంతాలలో అయిదు లైంగిక(Sexual Harrasment) దాడి కేసులు నమోదయ్యాయన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అలాగే 1997లో ఓ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. కొంతకాలం జైల్లో కూడా ఉన్నాడు. జైలు నుంచి వచ్చాక తన గ్రామంలో ఓ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. కాషాయానికి బదులుగా తెల్లకలర్ సూటు, బూటు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని దర్జాగా ఉండేవాడు. పాపం ప్రజలను మూఢ నమ్మకాలతో పూర్తిగా ముంచేశాడు. తాను నిర్వహించే సత్సంగ్‌లలో ఇచ్చే పవిత్రజలం తాగితే సమస్యలు తీరిపోతాయని భోలేబాబా ప్రచారం చేయించాడు. ఇది నమ్మిన జనం తండోపతండాలుగా వచ్చారు. బాబా మీద గుడ్డి నమ్మకంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.