హర్యానాలోని(Haryana) ఖురేషిపూర్‌(Qureshipur) గ్రామానికి చెందిన ఓ పెళ్లికొడుకు(Groom) చిత్రమైన పనితో సోషల్‌ మీడియాలో(Social Media) వైరల్ అవుతున్నాడు. మామూలుగా వరుడు పూలతో చేసిన దండను వేసుకుంటాడు. కాని అతడు మాత్రం కరెన్సీ నోట్లతో(Currency Notes) తయారు చేసిన అతి పెద్ద దండను(Garland) మెడలో వేసుకున్నాడు. ఆ దండ ఎంత పెద్దగా ఉందంటే.. అతడు మేడ మీద గోడపై నిల్చుంటే మెడలో ఉన్న కరెన్సీ నోట్ల దండ పై నుంచి కింది వరకు వచ్చింది.

హర్యానాలోని(Haryana) ఖురేషిపూర్‌(Qureshipur) గ్రామానికి చెందిన ఓ పెళ్లికొడుకు(Groom) చిత్రమైన పనితో సోషల్‌ మీడియాలో(Social Media) వైరల్ అవుతున్నాడు. మామూలుగా వరుడు పూలతో చేసిన దండను వేసుకుంటాడు. కాని అతడు మాత్రం కరెన్సీ నోట్లతో(Currency Notes) తయారు చేసిన అతి పెద్ద దండను(Garland) మెడలో వేసుకున్నాడు. ఆ దండ ఎంత పెద్దగా ఉందంటే.. అతడు మేడ మీద గోడపై నిల్చుంటే మెడలో ఉన్న కరెన్సీ నోట్ల దండ పై నుంచి కింది వరకు వచ్చింది. సుమారు 20 లక్షల రూపాయల విలువైన 500 రూపాయల నోట్లను ఈ దండకు ఉపయోగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌(Viral) అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తలోరీతిన స్పందిస్తున్నారు. అతడు నిల్చున్న ఇల్లు ఏమో పేద ఇల్లులా ఉంది. వరుడేమో ఖరీదైన దండను మెడలో వేసుకున్నాడు. కరెన్సీ నోట్లను ఇలా ప్రదర్శించడం అవసరమా అని కొందరు కామెంట్‌ చేస్తున్నరు. ఆ దండలోని నోట్లు నకిలీ కావచ్చని కొందరు అనుమానపడుతున్నారు. దీని గురించి ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాలని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత పెద్ద కరెన్సీ దండ వేసుకుని ఆ వరుడు ఎలా నడుస్తాడు అని ఒకరు కామెంట్‌ చేశాడు.

Updated On 24 Nov 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story