హర్యానాలో(Hariyana) సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లింది. భారతీయ జనతా పార్టీ(BJP), జననాయక్‌ జనతా పార్టీ(JJP) మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంపై రెండు పార్టీల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయమూ రాలేదు. సీట్ల విషయంపై రెండు పార్టీలు పట్టిన పట్టు వదలడం లేదు. ఈ నేపథంలో బీజేపీతో జేజేపీ పొత్తు తెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌(Manohar lal Khattar) రాజీనామా చేయనున్నారని సమాచారం

హర్యానాలో(Hariyana) సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లింది. భారతీయ జనతా పార్టీ(BJP), జననాయక్‌ జనతా పార్టీ(JJP) మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంపై రెండు పార్టీల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయమూ రాలేదు. సీట్ల విషయంపై రెండు పార్టీలు పట్టిన పట్టు వదలడం లేదు. ఈ నేపథంలో బీజేపీతో జేజేపీ పొత్తు తెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌(Manohar lal Khattar) రాజీనామా చేయనున్నారని సమాచారం. 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుగురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అలాగే హర్యానా లోఖిత్‌ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే గోపాల్‌ కందా(Gopal Kanda) కూడా బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి తప్పుకున్నా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల బలం ఉంటుంది. అంటే బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. హర్యానా మంత్రివర్గం నుంచి జన నాయక్‌ జనతాపార్టీని తప్పించడానికే బీజేపీ ఈ వ్యూహం పన్నిందని ఇన్‌సైడ్‌ టాక్‌. మరోవైపు ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్జర్‌ అధికార బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకోవైపు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీలోనే దుష్యంత్ చౌతాలా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో దుష్యంత్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Updated On 12 March 2024 2:33 AM GMT
Ehatv

Ehatv

Next Story