వీధికుక్కల(Street Dogs) దాడిలో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు విడిచారు. చాలా మంది గాయాలబారిన పడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వాలు కుక్కకాటును(Dog bite) సీరియస్‌గా తీసుకోవు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు ఓ రెండు మూడు రోజులు ప్రభుత్వాలు హడావుడి చేస్తాయి. తర్వాత షరామామూలే! అందుకే కుక్క కాటుకేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు(Haryana-Punjab High court) సంచలన తీర్పును ఇచ్చింది.
వీధికుక్కల(Street Dogs) దాడిలో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు విడిచారు. చాలా మంది గాయాలబారిన పడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వాలు కుక్కకాటును(Dog bite) సీరియస్‌గా తీసుకోవు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు ఓ రెండు మూడు రోజులు ప్రభుత్వాలు హడావుడి చేస్తాయి. తర్వాత షరామామూలే! అందుకే కుక్క కాటుకేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు(Haryana-Punjab High court) సంచలన తీర్పును ఇచ్చింది. కుక్క కాట్లకు రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్కకాటు కేసుల్లో(Dog Bite Case) ఒక్కో పంటి గాటుకు పది వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు తెలిపింది. కుక్కకాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే 20 వేల రూపాయలు బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్కకాటు కేసులో దాఖలైన 193 ఘటనలకు సంబంధించి హైకోర్టు విచారణ చేపట్టింది.
గత నెలలో వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ వీధి కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దాంతో ఆయన చనిపోయారు. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ వచ్చింది. పంజాబ్, హర్యానాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్కకాటు కేసులపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. వీధి కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, పందులు, పెంపుడు జంతువులు దాడి చేసినప్పుడు కూడా చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో పంజాబ్-హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది.