ఇటీవలి కాలంలో దేశాంతరాలు, ఖండాంతరాలు దాటే ప్రేమలు(Love stories) తరచూ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఈ ప్రేమకు వారథిగా ఉంటోంది. సోషల్ మీడియా(Social media) ద్వారా ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు ఫ్రెండ్‌షిప్‌గా మారడం, ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా ప్రేమ ముదరడం, పెళ్లికి దారి తీయడం వంటి ఘటనలను చూస్తూనే ఉన్నాం.
ఇటీవలి కాలంలో దేశాంతరాలు, ఖండాంతరాలు దాటే ప్రేమలు(Love stories) తరచూ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఈ ప్రేమకు వారథిగా ఉంటోంది. సోషల్ మీడియా(Social media) ద్వారా ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు ఫ్రెండ్‌షిప్‌గా మారడం, ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా ప్రేమ ముదరడం, పెళ్లికి దారి తీయడం వంటి ఘటనలను చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్‌గా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) అబ్బాయి, నెదర్లాండ్స్(Netherlands) అమ్మాయి ఇలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో కథ సుఖాంతమయ్యింది. ఈపెళ్లికి బంధుమిత్రులతో పాటు రాజకీయనాయకులు కూడా హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల హార్దిక్ వర్మ(Hardik varma) ఇటీవల ఉద్యోగరీత్యా నెదర్లాండ్స్‌కు వెళ్లారు. అక్కడ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో(Pharmaceutical) సూపర్‌వైజర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఆ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న గాబ్రిలాతో(Gabriella) స్నేహం ఏర్పింది. ఆ స్నేహం అచిరకాలంలోనే ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. గత వారం గాబ్రిలాను వెంటబెట్టుకుని స్వదేశానికి వచ్చారు హర్దిక్. తల్లిదండ్రులకు విషయం తెలిపారు. వారు కూడా కొడుకు ప్రేమకు ఓకే చెప్పారు. నవంబర్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. 'మా కుటుంబీకులు అంతా గుజరాత్‌లో(Gujarat) ఉంటారు. కానీ మా పూర్వికుల నుంచి ఇళ్లు ఇక్కడే ఉంది. అందుకే అందరం ఫతేపూర్‌కు వచ్చాం. హిందూ సాంప్రదాయం ప్రకారమే గాబ్రిలాను వివాహం చేసుకున్నాను. డిసెంబర్ 25న నెదర్లాండ్స్ వెళ్లిపోతాం. అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతుల్లో కూడా వివాహం చేసుకుంటాం.' అని కొత్త పెళ్లికొడుకు హర్దిక్ వర్మ తెలిపారు