కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని(Kishan Reddy) 'హనుమాన్'(Hanuman) సినిమా హీరో తేజా సజ్జ(Teja Sajja) కిషన్‌రెడ్డిని కలిశారు. తమ సినిమాకు వచ్చే ప్రతి టికెట్ డబ్బులో 5 రూపాయలు అయోధ్యలోని(Ayodhya) రామమందిరానికి(Ram mandir) అందిస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించారు.

Teja Sajja
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని(Kishan Reddy) 'హనుమాన్'(Hanuman) సినిమా హీరో తేజా సజ్జ(Teja Sajja) కిషన్‌రెడ్డిని కలిశారు. తమ సినిమాకు వచ్చే ప్రతి టికెట్ డబ్బులో 5 రూపాయలు అయోధ్యలోని(Ayodhya) రామమందిరానికి(Ram mandir) అందిస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డిని కలవడంతో ఈ నిర్ణయాన్ని ఆయన అభినందిచారు. హీరో తేజా సజ్జాను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సత్కరించారు.
ప్రశాంత్ వర్మ(Prashanth Varma), తేజ కాంబినేషన్లో నిర్మించిన హనుమాన్ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫాం బుక్ మై షోలో 20 లక్షల టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఇదే రికార్డు అని బుక్ మై షో(Book My show) ప్రకటించింది. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు సాధించడం హనుమాన్ సినిమాకు వస్తున్న ఆదరణకు నిదర్శనం. ప్రముఖులు, సెలెబ్రిటీలతో పాటు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
