భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికి(Vijayanagara Kingdom) ఒక ప్రతేయక గుర్తింపు ఉంది. దీనిని 1082 లో సంగమ రాజవంశానికి చెందిన మొదటి హరిహర రాయుడు(Harihara Rayudu), సోదరుడు మొదటి బుక్క రాయుడు స్థాపించారు. తెలుగు వారు గర్వాంగా చెప్పుకునే రాజు శ్రీకృష్ణదేవరాయలు ఇదే వంశానికి చెంది విజయనగర సామ్రాజ్య కీర్తిని నలుదిక్కుల వ్యాపింపచేసాడు.
భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికి(Vijayanagara Kingdom) ఒక ప్రతేయక గుర్తింపు ఉంది. దీనిని 1082 లో సంగమ రాజవంశానికి చెందిన మొదటి హరిహర రాయుడు(Harihara Rayudu), సోదరుడు మొదటి బుక్క రాయుడు స్థాపించారు. తెలుగు వారు గర్వాంగా చెప్పుకునే రాజు శ్రీకృష్ణదేవరాయలు ఇదే వంశానికి చెంది విజయనగర సామ్రాజ్య కీర్తిని నలుదిక్కుల వ్యాపింపచేసాడు.
11 వ శతాబ్దం చివరి నాటికి ఇస్లామికు దండయాత్రలను నివారించడానికి దక్షిణాది శక్తుల ప్రయత్నాల పరాకాష్ఠగా ఈ సామ్రాజ్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది 1646 వరకు కొనసాగినప్పటికీ 1565 లో తళ్ళికోట యుద్ధంలో దక్కను సుల్తానేట్ల సంయుక్త సైన్యాలుతో జరిగిన పోరాటంలో ఓటమి తరువాత దాని శక్తి క్షీణించింది. ఈ సామ్రాజ్యం దాని రాజధాని విజయనగరం పేరు మీద ఉంది. దీని శిథిలాలు ప్రస్తుత హంపి పరిసరాలలో ఉన్నాయి. హంపి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది.
దక్షిణ భారతదేశంలో విస్తరించిన సామ్రాజ్యం వారసత్వసంబంధిత అనేక స్మారక చిహ్నాలు ఉన్నాయి. వీటిలో బాగా తెలిసినది హంపి. హంపి వద్ద ఉన్న నిర్మాణలు దక్షిణ, మధ్య భారతదేశంలో వివిధ ఆలయ నిర్మాణ సంప్రదాయాలు విజయనగర నిర్మాణకళా శైలిలో నిర్మితమయ్యాయి. విజయనగరపాలన సమర్థవంతమైన పరిపాలన, శక్తివంతమైన విదేశీ వాణిజ్యం, నీటిపారుదల, నీటి నిర్వహణ వ్యవస్థ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చింది. సామ్రాజ్యం ప్రోత్సాహంతో కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతంలో లలిత కళలు, సాహిత్యం కొత్త ఎత్తులకు చేరుకోగలిగింది. ప్రస్తుత రూపంలో కర్ణాటక సంగీతం ఉద్భవించింది. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత చరిత్రలో హిందూ మత ప్రచారం చేయడం ద్వారా దక్షిణ భరతదేశాన్ని సమైక్యపరచి ప్రాంతీయతను అధిగమించింది.
అలాంటి సామ్రాజ్యానికి నిలువెత్తు సాక్షంగా ఉన్న హంపి ఇప్పుడు చాలామటుకు శిధిలాలుగానే మిగిలాయి. కాని అక్కడికి వెళ్లిన వాళ్ళకి అప్పటి రోజుల్లో అక్కడ జీవన విధానం ఎలాఉండేది. అంగళ్ళల్లో రతనాలు అమ్మిన అప్పటి మార్కెట్ వ్యవస్థ, మనుషులు, రాజ కుటుంబం ఎలాఉండేదో చూడాలని అనిపించక మానదు. ఆ కొరత తీర్చింది ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్.
జి-20 సమావేశం ఇటీవల హంపిలో జరిగింది. సమావేశం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ అధికారులు హంపి, విజయనగర సామ్రాజ్యం యొక్క AI- రూపొందించిన చిత్రాలను ఆవిష్కరించారు. ఇవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రాలు హంపికి వచ్చే పర్యాటకుల సంఖ్యను పెంచడానికి దోహద పడుతున్నాయి.
ఆ కాలంలో హంపికి ఉన్న వారసత్వం ఏమిటి, విజయనగర సామ్రాజ్యం, దాని ప్రజలు, ఆచారాలు, వనరులు, ఆలయ వాస్తుశిల్పం మొదలైనవాటిని AI చిత్రాలలో చూడవచ్చు. ఈ AI చిత్రాలు హంపి వారసత్వాన్ని వర్ణిస్తాయి.
విజయనగర సామ్రాజ్యంలో ఉన్నట్లుగా గుర్రాలు, ఏనుగులు , ఇతర జంతువులను కొనుగోలు చేసివారిని అందంగా చిత్రించారు.పొంగిపొర్లుతున్న నది, దేవాలయాలు, రాజకుటుంబం యొక్క చిత్రాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
విజయనగరం శ్రీకృష్ణదేవరాయల(Shri krishnadevaraya) కాలంలో ముత్యాలు, రత్నాలు అంగళ్లలో రాశులగా పోసి అమ్మేవారట అలాంటి విజయనగరం ,హంపి ఒకప్పుట్టి గొప్పదనాన్నీ చరిత్ర, పుస్తకాల ద్వారా మనకు తెలుసు. ఇప్పుడు హంపి వారసత్వం, విజయనగర సామ్రాజ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ప్రపంచానికి వర్ణించబడుతోంది.
ఎంతో అందంగా ఉన్న హంపి నేడు శిథిలావస్థకు చేరుకుంది. వాస్తు శిల్పం మరియు దేవాలయాలు దెబ్బతిన్నాయి, అయినప్పటికీ ఇక్కడకు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకుల కొరత లేదు. స్మారక చిహ్నాలు, దేవాలయాలు ఇతర వారసత్వ ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు హంపికి వస్తూ ఉంటారు.
ఇటీవలి కాలంలో హంపి ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు టైలర్ మేడ్ ప్లేస్‌గా మారింది. ఫోటో లేదా ఫిల్మ్ షూట్‌లకు స్థానిక అధికారుల అనుమతి తప్పనిసరి.
AI రూపొందించిన హంపి(Hampi) చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ హంపి కట్టడాలకు మాత్రం న్యాయం జరగడం లేదు. శిథిలావస్థకు చేరుకుంటున్న కట్టడాలని ఇప్పటికైనా పరిరక్షించి ఘనమైన మన చరిత్రని భావితరాలకు అందించాలని కోరుకుందాం.