ఓటమితో కుంగిపోతే విజయం ఎప్పుడూ దక్కదు. పోరాడుతూనే ఉండాలి. ఎప్పుడోసారి గెలుపు కచ్చితంగా దక్కుతుంది. బెంగాల్‌లోని(Bengal) సిలిగురికి చెందిన హిమాంతిక్ మిత్రా(Himanthik Mithra) ఈ కోవకే చెందుతారు. ఆమెను పట్టువదలని విక్రమార్కురాలని పిలవచ్చు. ఎందుకంటే ఓ ఉద్యోగం(Job) కోసం పట్టువీడకుండా 30 కంటే ఎక్కువసార్లు ఒకే కంపెనీకి అప్లై చేశారు. చివరకు ఉద్యోగాన్ని సంపాదించారు. అంత కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని ఏడాది తిరక్కుండానే వదిలిపెట్టేశారు.
ఓటమితో కుంగిపోతే విజయం ఎప్పుడూ దక్కదు. పోరాడుతూనే ఉండాలి. ఎప్పుడోసారి గెలుపు కచ్చితంగా దక్కుతుంది. బెంగాల్‌లోని(Bengal) సిలిగురికి చెందిన హిమాంతిక్ మిత్రా(Himanthika Mithra) ఈ కోవకే చెందుతారు. ఆమెను పట్టువదలని విక్రమార్కురాలని పిలవచ్చు. ఎందుకంటే ఓ ఉద్యోగం(Job) కోసం పట్టువీడకుండా 30 కంటే ఎక్కువసార్లు ఒకే కంపెనీకి అప్లై చేశారు. చివరకు ఉద్యోగాన్ని సంపాదించారు. అంత కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని ఏడాది తిరక్కుండానే వదిలిపెట్టేశారు. అసలేం జరిగిందంటే..సిలిగురికి చెందిన హిమాంతిక మిశ్రా బెంగళూరులో ఉంటూ మైక్రోసాఫ్ట్‌లో(Microsoft) ఉద్యోగం కోసం ప్రయత్నించసాగారు. అప్లై చేసిన ప్రతీసారి రిజెక్ట్ అయ్యేది. అయినా పట్టు వీడకుండా అప్లై చేస్తూ వెళ్లారు. 30 కంటే ఎక్కువసార్లే అప్లై చేసి ఉంటారు. చివరకు ఉద్యోగాన్ని సాధించారు. అంత గా కష్టపడి తెచ్చుకున్న జాబ్‌ను కవేలం ఏడాది మాత్రమే పని చేశారు. రాజీనామా చేసి కంపెనీనే కాకుండా బంధు మిత్రులు కూడా షాకయ్యారు. ఏమిటీ పిచ్చిపని అని లోలోపల తిట్టుకున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ 2020లో దేశవ్యాప్తంగా నిర్వహించిన హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొనేవారి నుంచి సపోర్ట్ ఇంజినీర్లను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుసుకున్న మిత్రా ఆ ఉద్యోగానికి అప్లై చేశారు. అప్పుడు మొత్తం 11 వేల మందికి పైగా ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నారు. చివరి రౌండ్ వరకు వచ్చిన మిత్రా సెలెక్ట్ కాలేకపోయారు. అయితే ఆమె పనితీరుని చూసి మైక్రోసాఫ్ట్ రిక్రూటర్లు ఇంటర్వ్యూ చేయడానికి అంగీకరించారు. చివరకు ఇంటర్వ్యూలో నెగ్గి జాబ్ కొట్టేసింది. ఇంత కష్టపడి ఉద్యోగంలో చేరిన ఏడాది తరువాత జాబ్‌ను వదిలిపెట్టారు. అందుకు కారణం మైక్రోసాఫ్ట్ కంటే మంచి కంపెనీలో.. మంచి పొజిషన్‌లో ఉండాలనే కోరిక! భవిష్యత్తులో మళ్ళీ మైక్రోసాఫ్ట్‌లో అడుగు పెడతానని కూడా హిమాంతిక్ మిశ్రా చెప్పుకొచ్చారు.