ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh) నుంచి మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్‌కు(Kyrgyzstan) వెళ్లి చదువుకుంటున్న సుమారు రెండు వేల మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. వారికి భద్రత కల్పించాలంటూ విదేశాంగమంత్రి డాక్టర్‌ ఎస్‌.జైశంకర్‌కు(S. Jaishankar) విజ్ఞప్తి చేశారు బీజేపీ(BJP) సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావు(GVL Narsimha Rao).

ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh) నుంచి మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్‌కు(Kyrgyzstan) వెళ్లి చదువుకుంటున్న సుమారు రెండు వేల మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. వారికి భద్రత కల్పించాలంటూ విదేశాంగమంత్రి డాక్టర్‌ ఎస్‌.జైశంకర్‌కు(S. Jaishankar) విజ్ఞప్తి చేశారు బీజేపీ(BJP) సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావు(GVL Narsimha Rao). జీవీఎల్‌ నరసింహారావు వినతిపై విదేశాంగశాఖ మంత్రి వెంటనే స్పందించారు. సరైన చర్యలకు ఆదేశాలిచ్చారు. కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్‌కెక్‌లో భారతీయ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. వారిపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు చెందిన విద్యార్థులు చనిపోయారు. ఈ సంఘటనలు చాలా మందిని కదిలించాయి. ఈ వార్తలు విన్న జీవీఎల్ నరసింహారావు వెంటనే విదేశాంగశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల రక్షణకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా భారత రాయబార కార్యాలయం అధికారులకు విదేశాంగశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అక్కడున్న మన దేశపు విద్యార్థులు భద్రంగా ఉండేందుకు, లేదా సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చేందుకు తగు ఏర్పాట్లు తీసుకుంటున్నామని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. వెంటనే స్పందించి సకాలంలో జోక్యం చేసుకున్నందుకు విదేశాంగమంత్రికి జీవీఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. ఇక విద్యార్థులు, తల్లిదండ్రులు జీవీఎల్‌క ధన్యవాదాలు చెప్పారు.

Updated On 20 May 2024 5:43 AM GMT
Ehatv

Ehatv

Next Story