పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ(Bramhin) కులవృత్తిగా గుర్తింపునకు తమ పరంగా కృషి చేస్తామని రాజ్యసభ సభ్యులు(Rajya Sabha) జీవీఎల్‌ నరసింహారావు(GVL Narsimha) భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నేతలు ఒక ప్రకటనల విడుదల చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన జీవీఎల్‌ను విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ విశ్రాంత డైరెక్టర్‌ యామిజాల, ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ సలహాదారు చెరువు రామకోటయ్యతో(Ramakotaiah) పాటు ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు, ప్రతినిధులు తెన్నేటి సునీల్‌ శర్మ(Theneti Sunil Sharma), మేడవరపు లక్ష్మణరావు, శివగణేష్‌, రాజేష్‌, సాయి, కె సుబ్రహ్మణ్య శర్మ కలసి వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

పురోహితులకు జీవీఎల్‌ భరోసా

పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ(Bramhin) కులవృత్తిగా గుర్తింపునకు తమ పరంగా కృషి చేస్తామని రాజ్యసభ సభ్యులు(Rajya Sabha) జీవీఎల్‌ నరసింహారావు(GVL Narsimha) భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నేతలు ఒక ప్రకటనల విడుదల చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన జీవీఎల్‌ను విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ విశ్రాంత డైరెక్టర్‌ యామిజాల, ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ సలహాదారు చెరువు రామకోటయ్యతో(Ramakotaiah) పాటు ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు, ప్రతినిధులు తెన్నేటి సునీల్‌ శర్మ(Theneti Sunil Sharma), మేడవరపు లక్ష్మణరావు, శివగణేష్‌, రాజేష్‌, సాయి, కె సుబ్రహ్మణ్య శర్మ కలసి వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. నవరత్నాలకు పురోహితులు పనికిరారా ?, వేదం నేర్చుకునే విద్యార్థుల వేదవ్యాస్‌ పథకం ఎందుకు ఆపేశారు? వేదం విద్య కాదా? వీరు అమ్మఒడికి అనర్హులా? అని తెలిపామన్నారు. అన్ని కులాలకి కమ్యూనిటీ(Community) భవనాలకు ఇస్తుంటే బ్రాహ్మణులకు కమ్యూనిటీ భవనానికి కనీసం స్థలం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది పురోహితుల పరిస్థితి దయనీయంగా ఉందని, పౌరహిత్యాన్ని కులవృత్తుల జాబితాలో చేర్చాలని కోరారు. పురోహితులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక లక్షలాది మంది పరిస్థితి దయనీయంగా మారిందని, బ్రాహ్మణ సామాజిక వర్గంలోని పురోహితులు మాత్రం ఎలాంటి సంక్షేమం అందక అవస్థలకు గురవుతున్నారని వివరించారు. వైదిక వృత్తి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 38 లక్షల మంది బ్రాహ్మణులు జీవిస్తుండగా, వారిలో దాదాపు 32 లక్షల మంది ఓటు హక్కును కలిగిఉన్నారని, ప్రధానంగా పురోహితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించడం లేదన్నారు. నవరత్నాల ద్వారా అరకొర సంక్షేమాన్ని మాత్రమే అందిస్తూ, బ్రాహ్మణ సామాజిక వర్గానికి కనీసం జీవించేందుకు తగిన కృషి జరగడం లేదని వాపోయారు. దీనిపై అనేక సార్లు ప్రభుత్వానికి ఆయా సంఘాలు వినతులు పత్రాలు అందజేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు వంశపారంపర్యంగా వేదాలను గురువుల వద్ద అభ్యసించి, పౌరహిత్యం, అర్చకత్వం చేసుకోవడం అనవాయితీ అని, దీనిని కులవృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తుంటారని తెలిపారు.ఏడాదికి దాదాపు రెండు వేలమంది వేద విద్యార్థులు వేదాభ్యాసం పూర్తి చేసుకుంటే, ఐదు శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదని తెలిపారు. రాష్ట్రంలోని పురోహితుల భవన నిర్మాణ స్థల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని, తక్షణమే వారికి ఐదువేల గజాలతో కూడిన వేద భవనం నిర్మించాలన్నారు. పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే వారిలో ఆత్మస్తైర్యం పెరుగుతుందని, ఈ విషయంపై ప్రభుత్వాలు స్పందించి తక్షణమే ఉత్తర్యులు జారీచేయించేలా తమరు చర్యలు తీసుకోవాలని జీవీఎల్ నరసింహారావుకు విజ్ఞప్తి చేశారు.

Updated On 31 Dec 2023 4:41 AM GMT
Ehatv

Ehatv

Next Story