అసోంలోని(Assam) గౌహతి ఐఐటీలో(IIT) ఇంజినీరింగ్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని పుల్లూరు ఐశ్వర్య(Pulluru Aishwarya) ఓ హోట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది(Dead). ఐఐటీ గౌహతిలో ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్ధినిగా పోలీసులు దృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Guwahati IIT Student
అసోంలోని(Assam) గౌహతి ఐఐటీలో(IIT) ఇంజినీరింగ్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని పుల్లూరు ఐశ్వర్య(Pulluru Aishwarya) ఓ హోట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది(Dead). ఐఐటీ గౌహతిలో ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్ధినిగా పోలీసులు దృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ గౌహతిలో ఈసీఈ(ECE) చదువుతున్న ఐశ్వర్యతో పాటు ఆమె ముగ్గురు స్నేహితులు నూతన సంవత్సరం వేడుకల(New Year Celebrations) కోసం ఐఐటీ క్యాంపస్‌కు 25 కి.మీల దూరంలోని ఓ హోటల్‌లో రెండు రూమ్‌లను బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి నలుగురు హోటల్‌లో పార్టీ చేసుకున్నారు. జనవరి 1న ఉదయం తనతోపాటు గదిలో ఉన్న మరో స్నేహితురాలు బాత్‌రూంకు వెళ్లగా.. ఐశ్వర్య కింద పడి ఉండడాన్ని గమనించిన.. తోటి స్నేహితులు ఆమెను గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఐశ్వర్య మరణించినట్లు తెలిపారు. ఐశ్వర్య మరణం పట్ల ఐఐటీ సిబ్బంది, విద్యార్థులు సంతాపం తెలిపారు. కాగా హోటల్‌కు చేరుకునే సమయానికే వారు మద్యం సేవించి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
