ఈ ఫోటో చూశారా? జమ్ము కశ్మీర్‌లోని(Jammu Kashmir) గుల్మార్గ్‌(Gulmarg) ప్రాంతంలోని ఓ ప్రదేశమది! ప్రతి సంవత్సరం శీతాకాలంలో అక్కడి దృశ్యం ఇలా ఉంటుంది. మంచు(Snow) దుప్పటి కప్పుకున్నట్టుగా ఉంటుంది. పుష్య మాసంలో దట్టంగా మంచుకురిసేది. ప్రకృతి ధవళ వర్ణంతో మెరిసిపోయేది మురిసిపోయేది.

కారణం ఏమిటంటే పర్యావరణంలో(Environment) వచ్చిన మార్పే! ఇప్పటికే పర్యావరణం పూర్తిగా దెబ్బతింది. భవిష్యత్తులో మరిన్ని విపరీత పరిణామాలు జరగవచ్చు. అప్పుడు జీవులు అంతరించిపోవచ్చు. ప్రకృతిలో(Nature) జరిగే మార్పులను తట్టుకునేందుకు మనం సిద్ధంగా ఉంటే మనుగడ సాధించగలుగుతాం. లేకపోతే అంతరించిపోతాం! భూమి పుట్టినప్పటి నుంచి ఇలా అంతరించిపోయిన జాతుల సంఖ్య 500 కోట్లకుపైగానే ఉంటుంది. ప్రస్తుతం 90 లక్షల జీవజాతులు మాత్రమే భూమిపై మనుగడ సాగిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మాత్రం చాలా రకాల జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. రుతువులు(Seasons) క్రమం తప్పాయి. భూతాపం పెరిగిపోయింది. శీతకాలంలో వేడిమి ఉంటుంది. ఎండకాలంలో ఎండలు మరింతగా మండిపోతున్నాయి. వానకాలంలో వర్షాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి వచ్చింది. జులై, ఆగస్టులో నిజానికి వానలు పడాలి. కానీ ఆ నెలలో వడగాడ్పులు వీస్తున్నాయి. డిసెంబర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడమేమిటి? 2023లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 1.48 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర పెరిగాయి. ఇది మానవ చరిత్రలోనే అత్యధిక పెరుగుదల. ఇది భయాందోళనలు కలిగిస్తున్న విషయం. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం భూమికి ప్రమాదమే! ఇప్పుడైనా మేలుకొనకపోతే మన చావును మనం కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.

Updated On 18 Jan 2024 12:55 AM GMT
Ehatv

Ehatv

Next Story