సోషల్ మీడియాలో(Social media) పాపులారిటీ కోసం రోజురోజుకు కొందరు కొత్త పుంతలు తొక్కుతున్నారు. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా రద్దీగా ఇన్‌స్టా రీల్(Insta Reels) కోసం నడి రోడ్డుపై యోగా టీచర్(Yoga teacher) విన్యాసాలు చేసింది. యోగా పంతులమ్మకు పోలీసులు కూడా మంచి గుణపాఠమే చెప్పారు.
సోషల్ మీడియాలో(Social media) పాపులారిటీ కోసం రోజురోజుకు కొందరు కొత్త పుంతలు తొక్కుతున్నారు. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా రద్దీగా ఇన్‌స్టా రీల్(Insta Reels) కోసం నడి రోడ్డుపై యోగా టీచర్(Yoga teacher) విన్యాసాలు చేసింది. యోగా పంతులమ్మకు పోలీసులు కూడా మంచి గుణపాఠమే చెప్పారు. రోడ్డుపై విన్యాసాలు చేస్తూ ఎప్పుడూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తానని, మిగతా వారందరూ ట్రాఫిక్ నియమాలను(Traffic Rules) పాటించాలని కోరింది.
ఈ సంఘటనలో గుజరాత్‌లో(Gujarat) జరిగింది. ఓ యోగా టీచర్ నడి రోడ్డులో యోగా చేయడం ప్రారంభించింది. విషయం ఏంటంటే ఆ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. రద్దీగా ఉండే నగర రహదారిపై యువతి రీల్స్ చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది, కొందరికి అసహనం కూడా తెప్పించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని లైక్స్, వ్యూస్ కోసం, ఆ యోగా టీచర్ సాహసం చేయడమే కాకుండా ఇతర వాహనదారులను కూడా ప్రమాదంలో పడేసింది.40 ఏళ్ల వయసున్న దీనా పర్మార్(Dina Parmar) అనే యోగా ట్రైనర్.. రోడ్డు మధ్యలో అడ్డంగా యోగా చేసింది. దీంతో ఆ మార్గంలో వచ్చిన వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం గుజరాత్ పోలీస్ డిపార్ట్‌మెంట్ దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు మహిళపై చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఆమెతో ట్రాన్సిషన్ రీల్ చేశారు. ఆ యోగా టీచర్ తన తప్పుకు క్షమాపణలు చెప్పడం, బహిరంగంగా ఇలా రోడ్లపై విన్యాసాలు చేయడం ప్రమాదకరమని స్వయంగా ఆ మహిళే అంగీకరించింది.