గుజరాత్(Gujarat)లోని సూరత్ కోర్టు(Surat Court )లో కాంగ్రెస్(Congress) నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసు(Defamation Case)లో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్‌గాంధీ దాఖలు చేసి పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టేసింది. సెషన్స్ కోర్టు తీర్పుపై రాహుల్‌గాంధీ హైకోర్టును ఆశ్రయించనున్నారు.

No Relief For Rahul Gandhi In Defamation Case
గుజరాత్(Gujarat)లోని సూరత్ కోర్టు(Surat Court )లో కాంగ్రెస్(Congress) నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసు(Defamation Case)లో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్‌గాంధీ దాఖలు చేసి పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టేసింది. సెషన్స్ కోర్టు తీర్పుపై రాహుల్‌గాంధీ హైకోర్టును ఆశ్రయించనున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు కర్ణాటక(Karnataka)లోని కోలార్(Kolar)లో జరిగిన ఓ ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ఇంటిపేరుపై రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దొంగలంతా మోదీ ఇంటిపేరే ఎందుకు పెట్టుకుంటారు? అని రాహుల్ అంటూ నీరవ్ మోదీ(Nirav Modi), లలిత్ మోదీ(Lalit Modi), నరేంద్రమోదీ(Narendra Modi).. ఇలా కొన్ని పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ(Purnesh Modi) కోర్టుకు వెళ్లారు. రాహుల్‌పై పరువునష్టం దావా వేశారు. గత నెలలో సూరత్ దిగువ కోర్టు విచారణ జరిపి రాహుల్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటుగానే బెయిల్ మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చింది. రాహుల్‌కు ఇలా శిక్ష పడిందో లేదో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం రద్దు చేసింది. ట్రయల్ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టలేదని, కఠినంగా వ్యవహరించిందని, నిజానికి రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసే కాదని రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టుకు వెళ్లారు. శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్టకు నష్టంకలుగుతుందని పేర్కొన్నారు. శిక్షపై స్టే విధించాని కోరారు. అయితే రాహుల్ పటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టేసింది.